అగ్ని క్షిపణులంటే..:-గుర్రాల లక్ష్మారెడ్డి -కల్వకుర్తి.-నాగర్ కర్నూల్ జిల్లా.-సెల్,నెం.9491387977.

 ఫ్రెండ్స్ మీరు పౌరాణిక చిత్రాల్లో దేవదానవులు యుద్ధం చేసేటప్పు
డు ఒకరిపై ఒకరు ప్రయోగించు కొనే ఆయుధాలను గమనించే ఉంటారు. , నాగాస్త్రం, గరుడాస్త్రం
ఆగ్నేయాస్త్రం , పాశుపతాస్త్రం ఇలా ఎన్నో పేర్లతో ఆయుధాలు ఉన్నాయని, ఇలాంటి వాటిని మహాభారత యుద్ధంలో కౌరవులు పాండవులు ఉపయోగించారని 
పురాణాల ద్వారా ఇతిహాసాల ద్వారా మనకు తెలుస్తోంది. తరాలు యుగాలు మారిన కొలది
కాలానుగుణ్యంగా ఈ భూమి, సముద్రం,ఆకాశాలపై జరుగుతున్న యుద్ధాలలోను ప్రయోగించే చే ఆయుధాలు కూడా మార్పు చెంది
ప్రస్తుత ఈ యుగంలో అణు విజ్ఞానాన్ని ఆపాదించుకుని పూర్వ
పురాణ, ఇతిహాసాల భూమిక నే ఆధారంగా తీసుకుని సైన్న్ సాంకే
తిక పరిజ్ఞానంతో మన దేశమే కాకుండా ప్రపంచంలోని అగ్రదేశా
లన్ని క్షిపణి ఆయుధ వ్యవస్థను
రూపొందించాయి. ఈ రూపకల్పన ఆధారంగా మనదేశ శాస్త్రజ్ఞులు
అగ్ని-1,అగ్ని-2,అగ్ని-3, పృధ్వి,
ఆకాశ్,త్రిశూల్ వంటి ప్రతిష్టాత్మకమైన క్షిపణులను తయారు చేశారు.అయితే మనం
ఇప్పుడు అగ్ని-1అగ్ని-2 అగ్ని-3ల
గురించి వివరంగా తెలుసుకుందాం
            మనదేశం 1984లో సుమారు రు. 380 కోట్ల రూపాయలతో  హైదరాబాదులోని
పరిశోధన అభివృద్ధి సంస్థ ఈ అగ్నిక్షిపణుల నిర్మాణం కార్యక్రమాన్ని చేపట్టింది. 1989లో
మొదటిసారి అగ్ని 1 మధ్య శ్రేణి రకాన్ని చాందిపూర్ నుంచి  పరీక్షించారు. దీని విస్తృతి కేవలం
పదిహేను వందల కిలోమీటర్లు.
దీనిలో ద్రవీకృత ఇంధనాన్ని వాడారు
           ఆ తర్వాత అగ్ని 2 క్షిపణిని
పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో జనవరి 17వ తేదీ ఒరిస్సా లోని బాలా సార్ వద్ద సముద్రంలో ఉన్న న ఐలాండ్ నుంచి పరీక్షించారు. ఇది 2200 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని సమర్థవంతంగా ఛేదించగలదు. ఇది 1000 కేజీల పే
లోడ్ తో ఉపరితల మీదినుంచి 
గురి పెట్టిన లక్ష్యాలను చేదిస్తుంది.
వారి హెడ్స్ ను గమ్యం చేర్చడానికి
ఇది చాలా అవసరం. దీనిలో ఘన ఇంధనాన్ని వాడారు. అందుచే అగ్ని2ను కేవలం 15 నిమిషాలలో ప్రయోగించ గలిగినా రు.
వీనిలో నిర్దిష్ట నేవిగేషన్ గైడెన్స్ ఎక్కువ. వీటి సేవలు త్రివిధ దళాలకు అందించే టందుకు కు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
command control system ను
ఇంకా అభివృద్ధి చేయాలని ని మన శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు.
అగ్ని-2 క్షిపణులు చైనా వాయువ్య నగరాలైనచెంగడ్, కునిమింగ్ వరకు వెల్ల గలిగి నాయి.
           మన పొరుగున ఉన్న చైనా, పాకిస్తాన్ దేశాల వివాదాస్పద ప్రకటనలను వాటి దుందుడుకు కార్యకలాపాలను మన ప్రభుత్వం దృష్టి యందు ఉంచుకొని ని భవిష్యత్ జాగ్రత్త కై
అగ్ని-3 క్షిపణి ని రూపొందించే ప్రయత్నంలో ఉంది. దీన్ని ఈ సంవత్సరాంతంలో పరీక్షించే
అవకాశాలు ఉన్నాయి. ఖండాంతర
సూపర్ సూర్యను తయారుచేసే 
స్వదేశీ పరిజ్ఞానాన్ని మనం ఇంకా సమకూర్చుకోవాలి. దీని ప్రయోగా
నికి మనం ప్రభుత్వం అనుమతిం
చేయాల్సి ఉంది. భూమి ఆకాశం సముద్రాల మీద ఈ క్షిపణులను
మోసుకెళ్లే ప్లాట్ ఫామ్స్ రూపొందిం
చుకోవాలన్నది భారత్ లక్ష్యమని
అణుముసాయిదాపత్రం పేర్కొన్నది