రాత్రనకా పగలనకా మన రైతన్న
హలంపట్టి పొలం దున్నుతున్నడన్న
స్వేదం చిందిస్తూ తాసాధనచేస్తూ
పంటపండించిమనకందిస్తున్నడన్న
రైతే రాజంటూ పొగుడుతారు రైతుని
చెవిలో పూలు పెట్టి తెగడుతారుబైతని
సర్కారును నడిపేటి మన నాయకులు
సరాసరి ధరను ప్రకటించని వినాయకులు
బజారులో పెరిగిన ఎరువుల ధరలు
బేజారైన మన రైతు నడ్డి విరుస్తున్నవి
వాసి లేని నాసిరకం తాలు విత్తనాలు
మొలకెత్తకుండా నిండా ముంచుతున్న వి
తాను తిన్నా తినకున్నా నెట్టుకొస్తుంటడు
తనకున్న దాంట్లో ఇతరులకు పెట్టి పస్తుంటడు
మకుటం లేని మహారాజు ఈ రైతన్న
మట్టిని నమ్ముకుని జీవిస్తున్న శ్రమ జీవన్న
ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొంటాడు
కరువు కష్టాలను దిగమింగుతూ ఉంటాడు
మన దేశప్రగతికి వెన్నెముకై నిలుస్తుంటడు
ప్రపంచ ప్రజల ఆకలి తీరుస్తూ ఉంటాడు
అతివృష్టి అనావృష్టి వర్షాల వల్ల
ఆ రైతన్న సంసారం ఆయనుగా గుల్ల
అయినా తాను చేస్తూనే ఉన్నాడు వ్యవసాయం
ఏమైనా మనకు అందిస్తున్నడు ఫలసాయం
రైతన్న మన దేశానికి రారాజు
ఆ రైతే లేకపోతే గడవదు ఏరోజు
ఆ రైతన్న మన దేశానికి వెన్నెముక
సైయంటూ ఈదేశం నడుస్తుంది చకచక
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి