ఈగల పెంపకం :-గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.-నాగర్ కర్నూలు జిల్లా.-సెల్ నెంబర్.9491387977.

 ఈ విశాల విశ్వంలో మానవుడు కోళ్లు కుందేళ్లు గొర్రెలు, మేకలు, కుక్కలు, పందులు, గుఱ్ఱములు బర్రెలు, ఏనుగులు ఒకటేమిటి అన్నింటిని పెంచి పోషిస్తూ తాను లాభపడుతూ ఇతరులకు లాభం కలిగిస్తూ విశ్వ కళ్యాణమునకు పాటు పడుతున్నాడు. అలానే ఇంకొక రకమైన ప్రాణుల పెంపకాన్ని గూర్చి కూడా మానవుడు ఇటీవలనే కొన్ని ప్రయోగాలు జరిపి వాటిని పోషిస్తున్నాడు. ఆ ప్రాణులేవో మీకు తెలుసా.....? ఈగలు.
ఈగలను పెంచేవారు ఉన్నారని మీరెప్పుడైనా విన్నారా? ఈగలను ఇప్పుడు లక్షల సంఖ్యల్లో పెంచుతు
న్నారండి. ఇలా పెంచి పోషించే ఈగల్లో దీర్ఘ పక్షములు, హస్ర్వపక్షములు కలిగిన రక్తాక్షి, శ్వేత సాక్షి అనే రకపు మక్షికాలు ముఖ్యమైనవి.
          గుర్రాల్ని,ఆవుల్ని మొ!! పెంపుడు జంతువుల పెంచి పోషించడం వల్ల మనకు లాభం ఉంది.మరి అంటురోగాల ను తప్పించే ఈ ఈగల వల్ల ఏం లాభం అని మీరు అనుకుంటున్నారు కదూ! అయితే వినండి. ఈగలను
పెంచడం లాభానికి కాదు. వీని వల్ల ఒక ముఖ్య ప్రయోజనం ఉంది. అందుకే"ప్రొఫెసర్ కాల్విన్ బ్రిడ్జెస్"
అనే ఒక అమెరికన్ శాస్త్రవేత్త లెనిన్ గ్రాడ్ నగరంలో ఈ ఈగల్ని పెంచి పోషించే విధానంపై ఒక దీర్ఘ ఉపన్యాసం ఇచ్చాడు. ముఖ్యంగా అందులో ఆయన "డ్రోసోఫిలా"అను ఈగల పెంపకాన్ని గూర్చి వివరించాడు. అయితే ఆయన తెలిపిన లాభం ఏమిటంటే, ఈగల మందల్ని పెంచడం స్వల్ప వ్యయంతో కూడినదే గాని ఇతర జంతువులకు పెట్టే అధిక వ్యయంతో కూడినది కాదు. వీని ఆహారం ఖర్చు కేవలం కొన్ని పైసలు మాత్రమే , అదియును గాక ఈగల మందలు అన్ని ఇతర మందలకంటే అతి శీఘ్రముగా వృద్ధిచెందుతాయి. పుట్టిన పది దినముల లోనే ఈగ పూర్తిగా పెరుగుతుంది. ప్రతి ఈగ వేల సంఖ్యలో తమ సంతానాన్ని ఉత్పత్తి చేస్తుంది. అన్ని వేల సంఖ్యల్లోని తమ సంతానాన్ని ఉత్పత్తి చేస్తుంది దీనికి కొద్ది స్థలం అయితే సరిపోతుంది. పదివేల ఈగల ఆహారానికి కేవలం ఆరు పైసలు మాత్రమే ఖర్చవుతుంది. ఇంత అల్ప వ్యయంతో కూడిన ఈ ఈ గల పెంచి పోషించడం దేనికోనని అనుకుంటున్నారా ఈ విశ్వంలో జన్మించిన మనం, మనతో బాటు మనం పెంచి పోషించే పెంపుడు జంతువులు రంగు ఆవులు, గుఱ్ఱములు, బర్రెలు,, పందులు ,కోళ్లు, ఈగలేకాక బఠానీలు, గోధుమలు మొదలగు ధాన్యము లకు కూడా అనువంశిక స్వీయ లక్షణాలు తమ సంతతికి అందించే తమ రూప వర్ణ ప్రధాన లక్షణాలు వంశపారంపర్య సూత్రాలు అన్నియు ఒకే మాదిరిగా ఉంటాయి. అందుకే ఈ పారంపర్య సూత్రాల పరిశీలనలో, వాటి మీద జరిగే ప్రయోగాలలో ఈ ఈగల్ని తప్ప ఇతర జంతువుల పై ప్రయోగాలు చేసి వాని ఫలితాలు పొందడానికి చాలా కాలం పడుతుంది. ఎలాగంటే మనం పది తరాల గుర్రములను పొందడానికి 60 ఏళ్లు పడుతుంది. అదే ఈ గురైతే పది తరాల ఈగల్ని కేవలం మూడు నెలలలో పొందవచ్చు.
              కాబట్టి ఈగల్ని కనుక జన్మ శాస్త్ర అ ప్రయోగాల్లో వాడితే తే ప్రయోగావసర వ్యవధిని ఎంతో కుదించు కోవచ్చు . వంశ వృక్షాన్ని వంశ లక్షణాలను అనువంశిక సూత్రాల్ని గూర్చి పాత పుస్తకాల్లో ఎత్తుకో నక్కర లేకుండానే పది తరాల లక్షణాల్ని నీ కళ్ళ తోనే స్వయంగా ఈగల పై చేసిన ప్రయోగాల ద్వారా మీరు చూడగలుగుతారు.
         అందుకే విజ్ఞానశాస్త్ర ప్రయోగాల్లో లో నేడు ముఖ్యంగా మాస్కోలోని "ఇనిస్టిట్యూట్ ఆఫ్ జనరిక్"(జన్మ పరిశీలన శాల) లో ఈ ఈ గల్ని పెంచుతున్నారు. వాణి పై అనేక ప్రయోగాలు చేసి ఇ కొంగ్రొత్త విషయాలను జన్మ శాస్త్ర ప్రయోగాల్లో కనుగొను చున్నారు. శాస్త్రజ్ఞులు ప్రకృతిలో నిత్యం జరిగే దాన్ని నియతం గా చేస్తున్నారు. స్వచ్ఛ రక్తము, ప్రశస్త లక్షణాలు గల ఈగల కుటుంబాల్ని వేల సంఖ్యలో తయారుచేసి ఆ ఈ గల కుటుంబాల్లో పోలికలను, నియమబద్ధంగా వస్తున్న సూత్రాలను సహితం వారు నిశిత పరీక్షలు చేసి తద్వారా ఇతర ప్రాణుల కుటుంబాల యొక్క క వంశపారంపర్య సూత్రాలను అతి స్వల్ప కాలంలో కనుగొంటున్నారు. అదే ఈగల్ని కాక ఇతర జంతువుల పైన అయితే చాలా కాలం పట్టేది. కాబట్టి ఈగల్ని మన జన్మ శాస్త్ర  ప్రయోగాల్లో వాడేందుకు అన్ని దేశాల్లో కూడా వీనిని పెంచి పోషించే జన్యు పరిశీలన శాల లను నెలకొల్పేందుకై ఆయా దేశాలు ఇప్పుడు డు గట్టి కృషిని జారిపోతున్నాయి. ఈ విధంగా ఈగల పెంపకం అతి సుకరం అనీ వానిద్వారా కలిగే ముఖ్య ప్రయోజనం కూడా డా ఇదేనని ఇప్పుడు మీరంతా తెలుసుకున్నారుగా. ఇక సెలవు.