జాతి నాయకుల పిల్లలం.:-గుర్రాల లక్ష్మారెడ్డి కల్వకుర్తి,-నాగర్ కర్నూల్ జిల్లా.-సెల్,నెం.9491387977.
జాతి నాయకుల పిల్లలం
నిజాయితి గల మల్లెలం
దేశమంటే మా కెంతో ప్రేమ
ఆ దేశంకై మేం పడతాం శ్రమ.

జాతిపిత మహాత్మాగాంధీజీ
జాతి నేత పండిత నెహౄజీ
భారత జాతి విధాతలు వీరు
స్పూర్తి ప్రధాతలై నిలిచినారు.

వారి మాటను వేదంగా తలుస్తాం 
వారి బాటలో మోదంగా నిలుస్తాం 
స్వాతిముత్యాల్లా వెలుగుతుంటాం
జాతిరత్నాల్లా మెలుగుతుంటాం.

కులం మతం మాకు లేనెలేదు
మోసంద్వేషం అంటే మాకు చేదు
అసత్యం పలుకు మాకు రానెరాదు
అనునిత్యం ఆవైపుకు మనసేపోదు

గాంధీజీ అహింసంటే మా కిష్టం 
రాజీయై పడతాం దానికి కష్టం
అష్టకష్టాలను మేం ఎదురుకుంటం 
మా ఇష్టాలతోమేం కుదురుకుంటం. 

మా జాతి నాయకులను కలుస్తాం 
వారే మా జీవన దైవాలని కొలుస్తాం   
వారికి  అండదండలను అందిస్తాం 
కోరి కొండంత అండయై నిలుస్తాం.

సత్యదీక్షావ్రతాన్ని మేం చేతబట్టి 
ఛేవ జవం మా గుప్పిట్లో బిగబట్టి 
ఆశయ సాధనకు మేం నడుం కట్టి 
ముందుకే సాగుతాం ఒట్టు పెట్టి. 

మావూరి జనాలను మేం చేరుతాం
వారి ఓటును వేయమని కోరుతాం 
మా ఓటును పనిచేసేవారికి వేస్తాం
ఓటమి లేకుండావారిని చూస్తాం.