రివ్వున ఎగిరే గువ్వ లంఘల్లున మోగె మువ్వలంఉల్లము దోచే పిల్లలంతెల్లని వెన్నెల మల్లెలం.మేం మోగిస్తాంమా బడి గంటపండిస్తాం మా చదువుల పంటగురువే మాకు ఇళ్లలో దేవుడుమేం కొలిచే అభినవ రాముడు.మా చదువుల తల్లి భారతిమేంఇస్తాం ఆమెకు హారతిఆ దేవత ఇచ్చును అభయంమాకు లేదు లే ఏ భయం.మాకు ఇంటాబయటా దోస్తులువారి ఆట పాటలు మాకు ఆస్తులుగడప గడప అంతా కలుస్తుంటాంఅడపాదడపా ఆనందిస్తుంటాం.అల్లరి పిల్లలం మేం కానేకాముఅనవసర గొడవలకు పోనే పోముఅందరితో కలిసిమెలసి ఉంటాంక్షేమసమాచారం తెలుసుకుంటాం.పెద్ద వారి మాటలే మాకు వేదాలువారితో మేం పెట్టుకోం వివాదాలువారే గా మాకు మార్గదర్శకులుమమ్ముల ఆదరించే మా నిర్దేశకులుముద్దు ముద్దు కథలేచదువుతాంహద్దు పద్దు ల్లోమేం ఎదుగుతాంఆటపాటలతో మాకు ఆరోగ్యంఆటపాటలతో వచ్చు సౌభాగ్యం.
ఉల్లము దోచే పిల్లలం:-గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి-నాగర్ కర్నూల్ జిల్లా.-సెల్,నెం.9491387977.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి