మా తరణి కళ్ళు తరుణి కళ్ళు తరుణి కళ్ళు
మా విద్యానిధి క్షేత్ర మై దివ్యంగా విలసిల్లు
అభం శుభం ఎరుగని మా చిన్నారులకు
శుభోదయాన్ని అందించే మా చిరు నాన్నలకు
విజ్ఞాన భోధి వృక్షమై నిత్యముఓ సత్యమై
అక్షరాల కుక్షియై అందరికీ సాక్షి అయి భాసిల్లు
మా తరణి కళ్ళు తరుణి కళ్ళు తరుణి కళ్ళు
తార తోరణాలతో మెరిసి పోవు మా లోగిల్లు.
సాహిత్యం సంగీతం గజ్జెలతో ప్రతినిత్యం గళ్ళు గళ్ళు
ఆటపాటలతో అలరించే మా నెమలి కళ్ళు.
తరుణి కళ్ళు తరుణి కళ్ళు తరుణి కళ్ళు
తరలిరండి తరుణులార. తూలకుండ మీవళ్ళు.
మీ ముందున్న వి చూసుకోండి గుజ్జనగూళ్ళు
తరుణుల వితరణతో తానెంతో విలసిల్లు
అక్షర లక్షల ను అందంగా అందించే మా తల్లి
మా సవాలక్ష ప్రశ్నలకు స్పందించాలి లేనీవుమళ్ళీ
వారు వీరు అనకుండా మాకు నీవు
తోడుఉండ
మాకు ఇంకెందుకు భయం ఉంది గానీ అభయం
ఈ తరుణి కళ్ళు తరుణి కళ్ళుతరుణి కళ్ళు
ఓ పురాతన మా సురా బాండాగారపు ఇల్లు.
తరుణులే ఎక్కుపెట్టి నిలబెట్టిన ఓ హరివిల్లు
ఆ తరుణులే నిత్యం ఇక్కడ విక్రయిస్తారు లే తాటికల్లు
తరుణి కళ్ళు తరుణి కళ్ళు తరుణి కళ్ళు
తిమ్మిని బమ్మిని చేసే బమ్మిని తిమ్మిని చేసే శకుని కల్లు.
చదువు రాని వారికి సదా కాను చెవులు గిల్లు.
ఆ తరుణులజోలి కెళ్ళావా ఇక నీ చెంప చెల్లు
తరుణికల్లు తరుణి కల్లు తరుణి కల్లు
మా ఊరిలో ని దేవుళ్లకు దండలు అల్లు
వచ్చిపోయే భక్తులకు ఇచ్చును లే పాలు పళ్ళు
అమ్మలక్కలు చేరి అందంగా కట్టుకున్న ఓ బొమ్మరిల్లు.
మరువని ప్రమోషన్ నాకు ఇప్పించిందిఈతరుణి కల్లు పల్లె
చెరగని చిరునామాను చేకూర్చిన నా వరాల ముల్లె
పన్నీరు అత్తరు సువాసనల వెదజల్లిన తెల్ల తెల్లని మల్లె
అండపిండ బ్రహ్మాండంగా మా స్వర్గధామంగా విరాజిల్లే
అప్పుడు ఏడు అంటే ఏడే తరగతులుండేవి
అవి ఎప్పుడూ పిల్లలతోనే నిండి ఉండేవి
నీటి వసతి లేకుండెను దాహార్తికి శాకుండెను
మధ్యాహ్న భోజనం ఉండే పిల్లల కడుపులు నిండుతుండె.
//ఈ కవిత గతంలో నే పని చేసిన
పాఠశాల గురించి////
మా తర్నికల్లు విద్యా క్షేత్రం.:-గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.నాగర్ కర్నూల్ జిల్లా.సెల్,నెం.9491387977.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి