నేనే శివుడను:--కిలపర్తి దాలినాయుడు--9491763261
అనలెత్తిన కామవికారానికి
అబలలు బలైనప్పుడు
ఆ పశువులను బూడిదచేస్తాను
అపుడు మదనాంతకుడైన
శివుడను నేనే!

పంచాగ్నుల మధ్యన నిలబడి
పాహిమాం...పాహిమాం ...అంటే
పోటెత్తిన భక్తుని గుండెకోట కాపలాకాస్తాను
భక్తసులభుడనగు
శివుడను నేనే!

హర హర మహాదేవా!ఆదుకొనుమ దేవా అంటే
కరోనా కాలయముని ఇంజక్షన్ త్రిశూలంతో
పాడిచిచంపు శిష్టరక్షకుడునైన
శివుడను నేనే!

అమాయక భక్తులపై విషంచిమ్మి
అణిచివేస్తే….
ప్రళయకాల నృత్యంతోబయలుదేరు
రుద్రుడ్ని నిర్నిద్రుడ్ని
శివుడను నేనే!
కొలిచినవారికి కొంగు బంగారాన్ని
తలచినవారిని తరింపజెసేవాడిని
ఒక సాలెపురుగు,ఒక ఏనుగు,ఒక పాము
చేసిన చిన్ని పూజకు మోక్షమిచ్చిన
శివుడిని నేనే!
భక్తకన్నప్పలు,భక్త మార్కండేయులు
చిరంజీవులై,ద్రువతారలై నిలిపిన వాడిని
ఆది మధ్యాంత రహితుడను
శివుడను నేనే!
కొలుచుకో….ముక్తికాంతిని పిలుచుకో!
-----------------------------------------------
*మనుమ సిద్ధివారి చేప్రశంసాపత్రం పొందిన కవిత* 

కామెంట్‌లు