రాము తెలివి:--మేడమయిన కళ్యాణి-పదవ తరగతి. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వేములాఘాట్, మండలం తోగుట, జిల్లా సిద్దిపేట. 9676526948
 రామాపురం అనే గ్రామంలో రాములమ్మ రామయ్య దంపతులు ఉండేవారు. వారు వ్యవసాయం చేసుకుంటూ బ్రతికే వారు. వారికి ఒక కుమారుడు. అతని పేరు రాము. అతనెప్పుడూ వాళ్ళ అమ్మ నాన్నకు, గ్రామానికి ఏదో ఒకటి చేయాలనే తలంపు గలిగినవాడు. అందరూ సంతోషంగా ఉంటేనే మనము సంతోషంగా ఉంటాం అని నమ్మేవాడు.
ఒకరోజు పొలం దగ్గరికి వెళ్ళాలి అనుకున్నాడు. వాళ్ళ అమ్మ తో చెప్పాడు. 
"వద్దు బిడ్డా! ఎండా తీవ్రంగా ఉంది. ఎండకు నువ్వు తట్టుకోలేవురా" అని సమాధానం ఇచ్చింది.
"అవునా! మరి మీరు రోజు పనికి  పోతున్నారు. మీకు ఎండ కొట్టదా?"
" మాకంటే అలవాటయింది. నువ్వేమో ఎండలు తట్టుకోలేవు. చెక్కెరవొచ్చిపడిపోతావ్. వద్దుబిడ్డ మా నాయన గాదు. చెప్తే వినాలి రా" అని తల్లి బుజ్జగించింది.
అయినా పట్టు విడవకుండా "అమ్మ నేను ఒక్కసారి పొలం కాడికి వస్తా... నన్ను రానివ్వవు." అని అదేపనిగా బతిమిలాడాడు. 
తల్లి చివరికి "చేసేదేమీ లేక సరే ఇంతగా అడుగుతున్నావు కాబట్టి ఈరోజు సాయంత్రం వెళ్దాం. సరేనా." అని అన్నది.
"మా మంచి అమ్మ. ఏదడిగినా కాదనదు" అంటూ అమ్మను పొగిడేశాడు. 
సాయంత్రం ఎప్పుడు అవుతుందని అని ఎదురు చూస్తున్నాడు. సాయంత్రం అయ్యింది రాము వాళ్ళ అమ్మానాన్నలతో కలిసి పొలం దగ్గరికి వెళ్ళారు. ఆశ్చర్యం అక్కడ పొలం అంతా నాశనం అయ్యింది. వరి పంటలను అంతా ఏనుగులు తొక్కే సాయి. పక్కనున్న పంటలను కూడా ఏనుగులు తొక్కే సాయి.
రాములమ్మ రామయ్య కళ్ళలో నీళ్లు గిర్రున తిరిగాయి. రైతులు దుఃఖం ఆపుకో లేకపోతున్నారు. 
"చేతికొచ్చిన పంట అంతా నేల పాలయింది."అని బోరున విలపిస్తున్నారు. రాము చాలా బాధపడ్డాడు. ఈ సమస్యకు ఏదైనా పరిష్కారం చేయాలనుకున్నాడు. తొందరగా ఇంటికి వెళ్లి ఇంటి పక్కనున్న వారందరిని కూడా గొట్టాలనుకున్నాడు. ఏనుగుల గురించి తెలుసుకోవాలనుకున్నాడు. ఏనుగులు వేటిని చూసి భయపడతాయి"అని తెలిసిన వారిని అడిగాడు. అన్ని పుస్తకాలలో, గూగుల్లో చూసాడు. చివరికి ఏనుగులు తేనెటీగలను చూసి భయపడతాయి అని రాము తెలుసుకున్నాడు. కానీ ఎలా ఈ తేనెటీగలను ఇక్కడికి తేగలను అని చాలా దీర్ఘంగా ఆలోచించాడు.
 అప్పుడు అతనికి ఒక ఆలోచన తట్టింది. దాన్ని వెంటనే అమలు చేసి ఏనుగులను తరిమికొట్టాలని నిర్ణయించుకున్నాడు. ఈ మధ్యనే తండ్రి రామయ్య రాముకి ఒక  రికార్డ్ బాక్స్ జాతరలో కొనిచ్చాడు. దాన్ని తీసుకెళ్లి ఒక చెట్టు మీద పెట్టి ఆ చెట్టు మీద కూర్చున్నాడు. అప్పుడే అక్కడికి ఏనుగులు రావడం చూసి ఆ రికార్డ్ బాక్స్ యొక్క బటన్ ఆన్ చేయగానే ఆ శబ్దాన్ని ఏనుగులు విని భయపడ్డాయి. శత్రువులు దాడి చేస్తున్నారని గ్రహించి అక్కడి నుండి పారిపోయాయి. అది చూసి తల్లిదండ్రులు రాముని చూసి ఎంతో గర్వ పడ్డారు. ఇది విని ఆ ఊరి జనం మెచ్చుకున్నారు. రాము తల్లిదండ్రులు తన యొక్క తెలివితేటలను చూసి  ఆనందించారు. రామాపురం గ్రామ పెద్ద  శివయ్య రాము దగ్గరికి వెళ్లి "మంచి పని చేసినవు బిడ్డా! ఈ ఊరులోని పంట పొలాలను కాపాడినందుకు చిన్నవాడివి అయినా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అయినా మీ పంట పొలాలు నాశనం అయ్యాక కూడా ఎందుకని నువ్వు ఈ పని చేశావు?" అని శివయ్య రాముని అడిగాడు. 
దానికి రాము జవాబుగా "నా తల్లిదండ్రులు బాధ పడ్డట్టు ఈ గ్రామంలోని ప్రజలు బాధ పడకూడదని. నా తల్లిదండ్రులు ఏడ్చినట్టు ఎవరు ఏడవ కూడదని. రైతులందరూ సంతోషంగా ఉండాలని. ఈ పని చేశాను."అని రాము జవాబు ఇచ్చాడు. 
ఆ మాటలు విన్న గ్రామ ప్రజలంతా రాము యొక్క మనస్తత్వాన్ని చూసి రాము పై ప్రశంశల వర్షం కురిపించారు. 
ఇది చూసి రాము తల్లిదండ్రులు ఆనందంలో మునిగిపోయారు. 

*నీతి: చదివిన చదువు మనకు మాత్రమే ఉపయోగపడేలా కాకుండా పదిమందికి ఉపయోగపడితేనే ఆ చదువుకి సార్థకత ఉంటుంది*


కామెంట్‌లు