వేమూరిగగ్గయ్య.వేదికనుండి-వెండితెరకు.:-డా.బెల్లంకొండ నాగేశ్వరరావు. 9884429899.

 సమాజ అభ్యున్నతికి ళలు ఎంతోవినియోగపడతాయి.ఈకళలు అరవైనాలుగు అని మనందరికితెలిసినదే, వీటిలో"కవిత్వము" "సంగీతము""శ్రవణానందాన్నికలిగిస్తే,"నృత్యము""శిల్పము""చిత్రలేఖనం"నయనానందాన్నికలిగిస్తాయి.వెరసిఇవన్నిమనకు మానసిక విజ్ఞానందాన్ని కలిగిస్తాయి .నిత్యజీవితంలోమనకు తరచూవినబడే మాటలు'ఏంనాటకాలు ఆడుతున్నావా!' నాదగ్గరనీనాటకాలుసాగవు' 'అబ్బోవాడా నాటకాలరాయుడు'అనేమాటలు తరచూ మనచెవినపడుతుంటాయి.ఈసమాజంపై నాటకరంగప్రభావం ఎలాఉందో తెలిసిపోతుంది.
ఆధునికఆంధ్రనాటకం1860తొలిస్వాతంత్రతెలుగునాటకం"మంజరిమధుకరీయం"దీని రచయిత  శ్రీకొరాడరామచంద్రశాస్త్రి.1880లోమొదటిసారి ఏప్రిల్ 16న కందుకూరువీరేశలింగం గారు ఒకనాటక సమాజంస్ధాపించి,ధార్వాడా నాటక సమాజంవారు హిందీ నాటకంఆడివెళ్ళిన పాకలోనే" రత్నావళి" అనేసంస్కృత అనే నాటకాన్ని,తెలుగు లో"చమత్కారరత్నావళి"షేక్స్ పియర్ ఇంగ్లీషు నాటకం"కామెడి ఆఫ్ ఎర్రర్స్ "అనేతెలుగు అనువాద నాటకాలనుకందుకూరువారుప్రదర్మించారు.ఇవే తెలుగులో తొలిఅనువాద నాటకప్రదర్మనలు. అదేరోజు కందుకూరివారి జన్మదినం కావడం యాదృఛ్ఛికం.ఆంధ్రదేశంలోతొలినాటకసమాజంగా"జగన్నాథవిలాసినిసభ"మొదటిదిగాగుర్తింపుపొందినావారుతెలుగునాటకాన్నిప్రదర్మించలేదు.వీరుసంస్కృత నాటకాలనేప్రదర్మించేవారు.1871లో"నరకాసురవిజయవ్యాయొగము"అనేనాటకంతెలుగులోతొలిసారిముద్రించబడింది.ఇదిశ్రీవారణాసిధర్మసూరిగారిసంస్కృతనాటకం,దీన్నితెలుగులో అనువాదించినవారు కొక్కొండవెంకటరత్నం పంతులు.కాలక్రమంలో ఎన్నో నాటకసమాజాలు పుట్టుకువచ్చాయి.తెలుగుభాషాసంపదను,పద్యంవిలువను లోకానికి చాటిచెప్పడానికి నాటకరంగం ఎంతోదోహదపడింది.
అఖిలాంధ్ర దేశంలో నాటకరంగ కళాకారులు తొలుత కాగడాలవెలుగులో ప్రదర్మనలు ఇచ్చేవారు. అటువంటిరోజుల్లో తన నటనాచాతుర్యంతో దుష్టపాత్రలకు వన్నెతెచ్చి యిటు నాటకరంగానికి అటు సినిమారంగానికి న్యాయంచేసిన మహనీయులలో వేమూరిగగ్గయ్య చెప్పుకోదగినవారు.
వీరి స్వగ్రామం గుంటూరుజిల్లా తెనాలితాలూకా వేమూరు.1895మే15 న జన్మించారు.విద్యపై ఆసక్తిలేని వీరు నాటక రంగంపై మక్కువ పెంచుకున్నారు. సురభి నాటక సమాజంలోచేరి , పలునాటకాలలో వివిధ పాత్రలు ధరిస్తూ రంగూన్ లోపదిమాసాల ప్రదర్మన అనంతరం తెనాలి వచ్చి 'గుంటూరుఫస్ట్ కపెని'లోచేరి పలుప్రదర్మనలు ఇచ్చారు.అనంతరం విజయవాడ 'మైలవరం బాలభారతి'సమాజంలోనూ, నంద్యాల మహేంద్రరెడ్డి సమాజంలో పలుపాత్రలుధరించి ప్రేక్షకుల నీరాజనాలు అందుకున్నారు.
ఆరోజుల్లో మైక్ లు అందుబాటులోలేవు.గగ్గయ్యగారి నాటకాలకు గర్బిణి స్త్రీలు, పిల్లలు భయపడివచ్చేవారుకాదట.వీరికళాసేవలు గుర్తించిన పుల్లయ్య గారు తనదర్మకత్వంలో ఈస్టిండియాఫిలింకంపెనివారు నిర్శిస్తున్న"సతీసావిత్రి"చిత్రంలో యముని పాత్ర ఇచ్చారు.ఇదితొలి తెలుగు టాకీ చిత్రం ఇందులో 'రామతిలకం' 'నిడుముక్కలసుబ్బారావు నటించారు 75 వేలరూపాయలతో నిర్మించిన ఈచిత్రం విజయంసాధించింది.అలా 'శ్రీకృష్ణలీలలు' (1935)లో కంసుడిగా,'సతీతులసి' (1936)లోజలంధురుడిగా,'మోహినీరుక్మాంగధ'(1937)లోరుక్మాంధరుడిగా,  'ద్రౌపతవస్త్రాపహరణం' (1936)లో శిశుపాలుడిగా,'భక్తమార్కండేయుడు'(1938) లోయముడిగా,'జరాసంధ'లో జరాసంధుడిగా,'మైరావణ'(1939) లోమైరావణుడిగా, 'దక్షయజ్ఞం' (1941)లో దక్షుడిగా,'భక్తప్రహ్లాద'(1942) లోహిరణ్యకసిపుడిగా ,శ్రీరామాంజనేయయుధ్ధం' లో అంగదుడిగా యిలా ఎన్నో విలక్షణ పాత్రలలో పాతిక చిత్రాలలో తన నటనా కౌశలాన్ని ప్రదర్మించి 'నభూతోనభవిష్యతి'అనేలా ప్రేక్షకుల హ్రుదయాలలో శాశ్వితస్ధానం పొందిన గగయ్యగారు క్యాన్స్ ర్ వ్యాధికి లోనై 1955డిసెంబర్ 30 వతేదిన కళామతల్లి ఒడిచేరారు.తెలుగు నాటక, సినిమా రంగంఉన్నంతకాలం గగయ్యగారి పేరు ధృవతారగా నిలిచిఉంటుంది అనడంలో సందేహంలేదు.

కామెంట్‌లు