నాటి తరం కథానాయకి శాంతకుమారి.:-డా.బెల్లంకొండ నాగేశ్వరరావు. 9884429899.


 వీరు  1920/ మే/17న వీరు కడపజిల్లా పొద్దుటూరులో వేల్లాల శ్రీనివాసరావు నరసమ్మ దంపతులకు జన్మించారు. ఈమెఅసలు పేరు  సుబ్బమ్మ.తల్లి సంగీత విద్వాంసురాలుకావడంతో ఈమెకు సంగీత శిక్షణకోసం మద్రాసులొ సాంబమూర్తి గారివద్ద శిక్షణ ఇప్పించారు. అనంతరం అక్కడే నవోదయ పాఠశాలలో సంగీత శిక్షకురాలిగా పనిచేసారు.ఈమె ప్రతిభను గుర్తించిన వేల్ పిక్చెర్స్ అధినేత తనచిత్రం'శశిరేఖా పరిణయం'(1936) లో ఈమెను శశిరేఖగా నటింపజేస్తూ,ఈమెపేరు శాంతకుమారిగా మార్చారు.అనంతరం 'సారంగధర'చిత్రంలో చిత్రాంగిగా నటించారు.తెలుగు సినిమాలలో తొలిసారి వీణపాట శాంతకుమారి గారిపై చిత్రికరించారు. ఆసమయంలో ఈమె దర్శకులు పుల్లయ్యగారిని ప్రేమవివాహంచేసుకున్నారు. అనంతరం 'వెంకటేశ్వరమహత్యం' ()చిత్రంలో పద్మావతిగా నటించారు.ఇదే చిత్రం తిరిగి తనభర్తతో కలసి(1960)లో  నిర్మించి తను వకుళమాతగా నటిస్తూ 'ఎన్నాళ్ళని నాకన్నులు కాయగా ఎదురుచూతురా గోపాలా'అనే గీతం మధురంగా పాడారు.'మాయలోకం' వీరి భర్త పి.పుల్లయ్యగారు నెలకొల్పిన రాగిణి సంస్ధ,పద్మశ్రీ పిక్చెర్స్ పతాకాలపై 'ధర్మపత్ని' భాగ్యలక్ష్మి'(1941)' 'అర్ధాంగి'(1955) 'సిరిసంపదలు''ప్రేమించిచూడు'(1965)'ప్రాణమిత్రులు' (1967) 'అల్లుడేమేనల్లుడు' (1970)'కొడుకు కోడలు'(1972) వంటి చిత్రాలు,మరికొన్ని తమిళంలోకూడా నిర్మించారు . 'జయభేరి'(1959)'' 'తల్లా పెళ్ళామా'(1970) '(1957)లో వచ్చిన సారంగధర' వంటి పలు చిత్రాలలో నటించారు.సినీ రంగంలో షష్టిపూర్తి చేసుకున్న ఈదంపతులకు పలు పురస్కారాలు లభించాయి.

1985 లో పుల్లయ్యగారు స్వర్గస్తులయ్యారు. ఈమెను రఘుపతి వెంకయ్య నాయుడు గారి పురస్కారంతో గౌరవించారు. ఈమె 'ముత్తయిదువ'(1979)చిత్రంలో నటించారు.

చెన్నయ్ లోని తన కూమార్తె ఇంట్లో 2016/జనవరి/ 16న కళామతల్లి ఒడి చేరారు.