దినకర్ ఆఫీసుకు వెళుతున్నాడు. అది గమనించిన చింటూ "చాక్లెట్ కొనివ్వు నాన్నా " అని అన్నాడు. "రేపు కొనిస్తాలే "అని అన్నాడు దినకర్.' సరే' అని ఊరుకున్నాడు చింటూ.
మరుసటి రోజు మళ్లీ చింటూ "నాన్నా! చాక్లెట్ కొనివ్వవూ" అని అన్నాడు. అప్పుడు దినకర్ "ఈరోజు చిల్లర డబ్బులు లేవు. రేపు కొనిస్తాలే" అని అన్నాడు. అది విన్న చింటూ" నాన్నా!రోజూ రేపు , రేపు అంటూ వాయిదా వేస్తున్నావు. నాకు ఈ రోజే చాక్లెట్ కావాలి " అంటూ మారాం చేయసాగాడు. " ఒరేయ్! నాకు ఆఫీసుకు ఆలస్యం అవుతున్నది. రేపు ఖచ్చితంగా కొనిస్తాను .సరేనా! నీవు ఎక్కువ మారాం చేసావంటే నాకు కోపం వస్తుంది" అని అన్నాడు దినకర్.
అది విన్న చింటూ " నాన్నా! కోపం అంటే ఏమిటి? అని ప్రశ్నించాడు ."తర్వాత చెబుతాలే "అని దినకర్ వెళ్ళిపోయాడు.
ఇంకొక రోజు చింటూ తిరిగి చాక్లెట్ కోసం మారాం చెయ్యసాగాడు. దినకర్ " ఊరుకో ! చాక్లెట్ ఆరోగ్యానికి మంచిది కాదు" అని అన్నాడు .అయితే వేరే ఏదైనా కొని పెట్టు " అని అన్నాడు చింటూ." ఏదీ కొనివ్వను. సరేనా!"అని అన్నాడు దినకర్. అది విన్న చింటూ " అయితే నేను అన్నం తినను .స్కూలుకి వెళ్ళను" అని అన్నాడు .
అప్పుడు దినకర్ నవ్వుతూ" ఇదిగో కోపం అంటే ఇదే !అర్థమైందా! ఇప్పుడు కొనిస్తాను పద" అంటూ చింటూను తీసుకొని బజారుకు వెళ్ళాడు.అందుకే కొన్ని విషయాలు అనుభవం ద్వారానే తెలుస్తాయి.
..............
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి