నదీస్నానం:--సంగనభట్ల చిన్న రామ కిష్టయ్య,ధర్మపురి.మొబైల్: 9908554535.

          రాము , సోము ప్రాణమిత్రులు. వారు ఎక్కడికి వెళ్ళినా కలిసే వెళ్లేవారు.
         వారు ఒకసారి వేసవికాలంలో రామాపురం గ్రామం వెళ్లి గోదావరి నదిలో స్నానం చేద్దామని వేకువనే  బయలుదేరారు.
         వారికి దారిలో దానయ్య అనే ఆ గ్రామస్థుడు కనబడి  "ఎక్కడికి "అని ప్రశ్నించాడు? వారు గోదావరి నదిలో స్నానం చేద్దామని వెళుతున్నామని  అతనికి చెప్పారు.
        ఆ మాటలను విన్న దానయ్య  "మీరు గోదావరిలో స్నానం చేద్దామని వెళ్లకండి" అని అన్నాడు. " ఏం? ఎందుకు? నీళ్లల్లో ఏమైనా మొసళ్లు కానీ  ఉన్నాయా!" అని ప్రశ్నించాడు రాము. " మాకు ఈత వచ్చులే .వరదలు కానీ వస్తున్నాయా" అని ప్రశ్నించాడు సోము?
          " అదేం లేదులే . అందులో నీళ్లే  లేవు.  నది ఎండిపోయింది కనుక "అని తాపీగా జవాబిచ్చాడు దానయ్య  .
         అందుకే ఒక్కొక్కసారి  మనం  అనుకోని సంఘటనలు ఎదురవుతాయి.
కామెంట్‌లు