నీతి పద్యాలు:-సంగనభట్ల చిన్న రామ కిష్టయ్ధ,ధర్మపురి.-మొబైల్: 9908554535.

73. ఆ.వె. ప్రోత్సహించు పరుల పొందిక ప్రేమను
               మెచ్చు గుణము పనిని హెచ్చు జేయు
               మారుతిని పొగడగ మరి వార్ది లంఘించె
               రమ్య సూక్తులరయు రామకృష్ణ .
   
74. ఆ.వె. మూర్ఖునికినిచెప్పు ముద్దు మాటలు నన్ని
                వసుధ నందు జూడ వ్యర్థ మగును
               చిల్లికుండ నింప చేరునా నీరంత
                రమ్య సూక్తులరయు రామకృష్ణ.

75. ఆ.వె. నీచ మనుజులెపుడు నిజమును పలుకరు
                బొంకుదురుగ వారు జంకు లేక
                ఎండమావిలోన  యెపుడు నీరుండదు
                రమ్య సూక్తులరయు రామకృష్ణ.

 
కామెంట్‌లు