నీతి పద్యాలు:--సంగనభట్ల చిన్న రామ కిష్టయ్య,ధర్మపురి మొబైల్: 9908554535.
79.ఆ.వె.జగతి పువ్వు మురియు జడలోనుగుడిలోను
              నవ్వు కనబడు నరు నాస్యమునను
              మువ్వ యెగిరి పడును సవ్వడి సేయంగ
              రమ్య సూక్తులరయు రామకృష్ణ .

80.ఆ.వె. చక్కనయ్య చూడ చంద్రుని వలెనుండు 
                నిష్టపడుదురింక నెందరైన
                గుణము గలిగి యున్న గోమేధికముగాదె
                రమ్య సూక్తులరయు రామకృష్ణ.

81.ఆ.వె. సాధు జంతువులను చక్కగా చూడగా
                నింటికేగ నవియు నెదురు వచ్చు
                కష్ట సుఖము లందు కన్నీరు పెట్టును
                రమ్య సూక్తులరయు రామకృష్ణ.