చివరి సలహా:---సంగనభట్ల చిన్న రామ కిష్టయ్య, ధర్మపురి.మొబైల్: 9908554535.

 మరణశయ్యపై ఉన్న దానయ్య తన నలుగురు కొడుకులను పిలిపించాడు. తమ తండ్రి మరణిస్తూ ఏ నిధి రహస్యాలు చెబుతాడేమోనని నలుగురు తండ్రి దగ్గరకు గబుక్కున వచ్చి చేరారు .
         అప్పుడు దానయ్య" ఒరేయ్! నేను ఇరువది సంవత్సరాల క్రింద మన ప్రక్క ఊరి సోమయ్యకు 
పది వేలు బాకీ ఇచ్చాను. వాడు అసలు కాదు గదా  కనీసం వడ్డీ కూడా చెల్లించలేదు. అందుకే మీకు చెబుతున్నాను "అని అన్నాడు.
       అప్పుడు కొడుకులు" మీరేమీ భయపడకండి నాన్నగారూ! మేము తప్పనిసరిగా ఆ సోమయ్య వద్ద  ఆ పది వేలు వడ్డీతో సహా  వడ్డీతో సహా  ముక్కుపిండి వసూలు చేస్తాం. మీరు దిగులు పడకండి "అని అన్నారు.
        " అయ్యో నా ఖర్మ ! నేను అలా అనుకునే ఈ స్థితికి చేరాను. మీరు దీని గురించి ఆలోచించి  నాలాగా ఆరోగ్యం పాడు చేసుకోకండి. వాడు నాకన్నా పిసినారి. జన్మలో నా ఈ బాకీ చెల్లించడు" అంటూ కన్నుమూశాడు.