నీతి పద్యాలు:--సంగనభట్ల చిన్న రామ కిష్టయ్య,ధర్మపురి. మొబైల్: 9908554635.
82.ఆ.వె. బద్ధకమును వలదు నిద్దరణిని జూడ
               కష్టపడుము నీవునిష్టముండి
               ఆస్తి పెరుగు నీకు నారోగ్యము కలుగు
               రమ్య సూక్తులరయు రామకృష్ణ .

83. ఆ.వె. పశువు బిడ్డ కిచ్చు పాలన్నిటిని కూడ
                బిడ్డ కట్టివైచి పితుకు నరుడు
                పిండుకొను మనిషికి పిసరంత దయలేదు
                రమ్య సూక్తులరయు  రామకృష్ణ.

84. ఆ.వె. నల్లకరి నడచును మెల్లగాను భువిపై
                జింక పరుగు దీయు చిరుత వలెను
                ఎక్కువ బరువుండ నెగిరి దూకుట యెట్లు
                రమ్య సూక్తులరయు  రామకృష్ణ.