మానవతా గీతం:-డాక్టర్. కొండబత్తిని రవీందర్--కోరుట్ల. జిల్లా:జగిత్యాల9948089819
మానవతకు ప్రాణమిచ్చు
మంచి మనసు కావాలి
మనమంతా ఒక్కటనే
మంచి రోజు రావాలి

కులమత భేదాలెందుకు
మనకిక వాదాలెందుకు
పేదలు ధనికులు ఒకటే
పోదాం ఇక పై ముందుకు

కండలు కరగించాలి
గుండెలు నినదించాలి
సహన దివ్వె ఎదలవిరిసి
సమైక్యతను తేవాలి

విజయ కేతనాలు పట్టి
విశ్వప్రగతి చాటాలి
వెలుగు పథం నడచి నరుడు
ప్రేమలు వర్షించాలి