మంచి ప్రయాణం:-యు.విజయశేఖర రెడ్డి,హైదరాబాద్,9959736475


 అన్నపూర్ణ,మనోహర్‌లు భార్య భర్తలు వీరి సంతానం రవి,మాధవి.మనోహర్ వాళ్లు నిజాంపేట్ విలేజ్‌‌లో

ఉంటున్నారు. 

మనోహర్ పదవ తరగతి వరకు చదువుకున్నాడు.జె.ఎన్.టి.యు. రోడ్ వద్ద ఒక ప్రైవేట్ కంపెనీ‌లో అటెండర్‌‌‌గా పని చేస్తున్నాడు. అన్నపూర్ణ కూడా పదవ తరగతి వరకు చదువుకుంది. వెన్నీళ్లకు చన్నీళ్లలా ఉంటుందని ఖాళీగా ఉండలేక భర్త పనిచేస్తున్న కంపెనీకి దగ్గర్లో ఉన్న రెడీ మేడ్ క్లాత్ షాప్‌లో కొత్తగా పనికి కుదిరింది. 

ఇంటికి దగ్గరలో ఉన్న ప్రభుత్వ ప్రాధమిక పాఠశాలలో రవి మూడవ తరగతి,మాధవి రెండవ తరగతి చదువుతున్నారు. పాఠశాల అయిపోగానే అమ్మానాన్న వచ్చే వరకు వారిద్దరూ చిరు తిళ్లు తిని, హోమ్ వర్క్ చేసుకుని కాసేపు ఆడుకునేవారు. 

సెలవు రోజుల్లో మనోహర్ సైకిల్ పై భార్య పిల్లలతో సినిమాకు షికారుకు తీసుకెళ్లేవాడు. 

ఒక రోజు మనోహర్ ఇలాగే భార్య పిల్లలతో షికారుకు వెళ్లి వస్తుండగా నిజాంపేట్ చౌరస్తాలో ఒక ట్రాఫిక్ పోలీస్ మనోహర్ సైకిల్‌ను ఆపాడు. 

మనోహర్‌‌తో పాటు భార్య,పిల్లలు సైకిల్ దిగారు. 

“నా పేరు సుందరం కొత్తగా వచ్చిన ట్రాఫిక్ పోలీస్‌ను...ఈ మధ్య రోడ్డు ప్రమాదాలు ఎన్నో జరుగుతున్నాయి మనం జాగ్రతగా వెళుతున్నా వేగంగా బండిని నడిపే వారి వల్ల వారికీ ఇతరులకు ప్రాణ హాని జరుగుతోంది ...హెల్మెట్ పెట్టుకోవక పోవడం వల్ల ద్విచక్ర వాహన చోదకులు ప్రాణాలు కోల్పోతున్నారు. నీతో కలిపి సైకిల్ మీద నలుగురు ప్రయాణం చేస్తున్నారు...ఇది ఎంతో ప్రమాదకరం ఇది చెప్పడానికే నిన్ను ఆపాను”

“సార్! మంచి విషయాలు చెప్పారు...ఇక మీదట ఇలా ప్రయాణం చేయము” అని మనోహర్ చేతులు జోడించి నమస్కారం చేశాడు. 

దానికి ప్రతి నమస్కారం చేస్తూ “నా మాట విన్నందుకు చాలా సంతోషం!” అన్నాడు ఆ ట్రాఫిక్ పోలీస్ సుందరం. 

అటు తరువాత మనోహర్ భార్య,పిల్లలతో బయటకు వెళ్ళేప్పుడు ఆటోలో మాత్రమే ప్రయాణం చేయసాగాడు. 

అవును మంచి వైపే మన ప్రయాణం సాగాలి...అప్పుడే జీవితం సఫలం అవుతుంది. 

    ****

  


కామెంట్‌లు