మూడు కోతులు: -క౦చనపల్లి ద్వారకనాథ్--చరవాణి: 9985295605
 కొత్తపల్లి ఊరికి ప్రభుత్వం అభివృద్ది పనులకు నిధులు మంజూరు చేయడంతో రోడ్లు , డ్రైనేజి,మంచినీటి సరఫరా లాంటి పనులు చెక చెకా సాగి అందమైన కొత్త పల్లి గా తయారైంది .దానికి తోడు  పూలచెట్లు ,రకరకాల ఆట వస్తువుల తో పాటు అందరినీ అలరించే  విధంగా  పెద్ద పార్కు   ఒకటి   నిర్మించడంతో పాటుగా .గాంధీజీ  విగ్రహం గూడా ఏర్పాటు చేసి   గాంధీ పార్క్ అని పేరు పెట్టారు . 
        ఆ వూరిలో కాపురం  ఉంటున్న చంద్రమౌళి,సరోజమ్మ  పిల్లలు వాణి ,హరికృష్ణలకు బడి సెలవు కావడంతో “ అమ్మ..మనం ఊరిలో కొత్తగా కట్టిన గాంధీ  పార్కుకు  మనము   వెళ్తాము.చాలా బాగుందని మా  ఫ్రెండ్స్ చెప్పారు .”  అన్నాడు హరి .”అవున్రోయ్ మనం గూడా   ఈ రోజు  పోదాం, నాన్న గూడా ఇంట్లోనే వున్నారు .సాయంత్రం పోదాం అని ప్లాన్ చేశారు. 
 ఆ సాయంత్రం పార్క్ చేరుకున్న వాళ్ళు    పెద్ద పార్క్    ఎంత అందంగా వుందో అనుకుంటు రకరకాల పూల  చెట్లను చూస్తూ  నడుస్తున్నారు  అక్కడక్కడ సేద   తీరడానికి  అంద మైన అరుగులు,అందమై న శిల్పాలు ,  వాటర్ ఫౌ౦టెన్స్ ను  చూస్తూ  దారిలో కనపడిన   ఆటవస్తులతో   ఆహ్లాదంగా ఆడుకున్నారు .కొందరు  వాకింగ్ చేస్తూ కష్టపడ్డారు .అలా  పార్క్   తిరుగుతూ  ఒకచోట  పెద్ద దిమ్మెపై నిలబడిన గాంధీజీ విగ్రహాన్ని చూశారు “   అమ్మోఎంత పెద్ద గాంధీ విగ్రహామో . “ అంది వాణి . “ అవును భలేవుంది “ అన్నాడు హరి   విగ్రహం కింద దిమ్మెపైన  గాంధీ గారి  మూడు కోతులు బొమ్మని గూడ  సిమెంటు తొ కట్టి కింద  చెడు చూడకు  ,చెడు మాట్లాడకు,చెడు వినకు  అని వ్రాసివుంది. అది చూసిన వాణి  అన్నయ్య అక్కడ  చూడు  మూడు కోతుల బొమ్మలు వున్నాయి .   అనగానే “అవును అమ్మ  . ఎందుకలా పెట్టి దానికింద చెడు చూడకు ,చెడుమాట్లాడకు ,చెడు వినకు వ్రాసి పెట్టారు “ అని అడిగాడు   .” అవును పిల్లలు మీకు   వాటిని  గురించి చెప్పవలసిందే .. రండి అక్కడ ఆ అరుగు మీద కూర్చుని  చెప్పుకుందాం “   అనగానే అందరూ అరుగుపైకి  చేరగానే  “ ఈ మూడు  కోతులు  అంటే గాంధీ గారి కి ఎంతో   ఇష్టం,  వీటిని గురించి అర్ధం అవ్వాలంటే మీకు తెలిసిన కథ రామాయణo లోని ఒక ఘట్టాన్ని ఉదాహరణగా చెప్తాను  వినండి  “  అనగానే  “అలాగే అమ్మ” అన్నారు .  ఇంతలో  పిల్లలకి” ఏమైనా తినడానికి తెస్తాను” అంటూ  బయలుదేరాడు  చంద్రమౌళి “ సరే అంటూ వాలా అమ్మ  చెప్పడం  ప్రారంభి౦చింది “దశరథ మహారాజు కు ముగ్గురు భార్యలు  . వాళ్ళ పేర్లు కౌసల్య , కైకేయి , సుమిత్ర లు ,వారికి రామ ,   లక్ష్మణ,భరత , శత్రుజ్ఞడు అనే   నలుగురు పుత్రులు కలిగిరి . వారు పెరిగి పెద్ద  వాళ్ళు అయ్యాక  ,  వివాహలు  చేశారు .   దశరథ మహారాజు తన  ప్రియ     పుత్రుడు   రామునికి పట్టాభిషేకం  చేయాలనుకున్నాడు .  ఆ విషయం కైకేయికి  తెలియగానే ,తన ప్రియ   దాసి అయిన     మంధర అనే  గూని ముసలిది  కైకేయికి తన మాటల చ్యాకచక్యంతో  చెడు ఆలోచనలు చెప్పుడు మాటల్తో తన కొడుకు భరతునికి పట్టాభిషేకం  ని  పుత్రుడు భరతునికి  రాజ్యాధికారం లభిస్తుంది .అని   నూరి  పోసింది .దానికి తోడు ఎప్పుడో  దశరధుడు   ఇస్తానన్న  కోరికలు     తీర్చుకోవాలని కైకేయి తన  పుత్రుడికి  పట్టాభిషేకం , రామునికి   పద్నాలుగేళ్ళ  వనవాసం చేయాలని మహారాజుకి ,రామునికి చెప్పడంతో    దశరథుడు      దుఃఖితుడై  ఇచ్చిన   మాట తప్పనివాడై కాదనలేక  పోవడం ,రాముడు పితృ వాక్కు పాటించడం తో  అడవులకు రామ లక్ష్మణ సీత లు వెళ్ళడం , ఆ దిగులుతో  దశరథుడు  మరణించడం తో ఈ చెడు  రాజ్యంలో అందరూ చూడడం జరిగింది . ఈ కథ ను గురించి ఆలోచిస్తే మనకు చెడు మాటలు వినడం , చెడును తన నోటి ద్వారా చెప్పి  రాముని అడవులకు పంపడం , దశరథుడు మరణిచడం   లాంటి  చెడు పరిణామాల లాంటివి అందరూ   చూడడం   జరిగింది .ఈ విధమైన కారణాలన్ని౦టికి చెడు అని మనం  తెలుసుకోవాలి . అందుకే గాంధీజీకి ఈ కోతుల  బొమ్మ అంటే   ఇష్టం. గాంధీ గారు   ఎన్నడూ  చెడు ఆలోచనలు చేయక , ఎప్పుడు సత్యాన్ని పలుకుతూ దేశానికి  స్వాతంత్ర్యం తెచ్చి  చరిత్రలో  మహాత్ముడు గా నిలిచిపోయాడు . “  అనగానే మాకు చాలా బాగా అర్థమయ్యేటట్లు  పిల్లలు భలే చెప్పావమ్మ మేము అలాగే వుంటాం “అన్నారు .ఇంతలో  వాళ్ళ నాన్న వచ్చి  పిల్లలకి తినడాని  ఇచ్చాడు . సంతోషంగా తింటూ పార్క్  చూస్తూ బయలుదేరారు .
కామెంట్‌లు