చిటికంత మట్టిలో
వేల జీవులు ఉండు
నిత్యమవి శ్రమపడుతు
నేల గుల్లను జేయు
గుల్లయిన నేలలే
విత్తులకు శ్రేష్ఠము
మొలకలు పుట్టుటకు
అగునవి నేస్తము
కోట్లాది జీవులు
పొలంలో నుండును
చూడ చిన్నవి గాని
పెను మేలు చేయును
విచక్షణ కోల్పోయి
విష తుల్య ఎరువులు
వాడితిమ అవియన్ని
నాశనం అగునురా
నేల మేలును గోరి
రసాయనాలు వాడి
ఉసురు తీయొద్దురా
క్రిములు లేని నేల
మృత నేల అగునురా
పంటలు మనకపుడు
మృగ్యమే అగునురా
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి