చూశారా-చూశారా:- సత్యవాణి
పసిపిల్లలు అమ్మను గుర్తించెే విధమును
చూశారా మీరు చూశారా

నెమలి పింఛమును 
విప్పేవిధమును
చూశారా మీరు చూశారా

హంసలు కొలనులొ ఈదే విధమును
చూశారా మీరు చూశారా

లేడి పరుగులను పెట్టే విధమును
చూశారా మీరు చూశారా

బాతుల గుంపులు నడిచే విధమును 
చూశారా మీరు చూశారా

చెవులపిల్లులూ గెంతెే విధమును
చూశారా మీరు చూశారా

కొమ్మలొ దాగే కోయిలమ్మను
చూశారా మీరు చూశారా

ఉడుతలు చెట్లను ఎక్కేవిధమును
చూశారా మీరు చూశారా

లేగదూడలూ పరుగెత్తే  విధమును
చూశారా మీరు చూశారా

పిల్లులు పాలను గుర్చించెెే  విధమును చూశారా మీరు చూశారా

చీమలు చక్కెర గుర్తించే విధమును
చూశారా మీరు చూశారా

కుక్కలు ఇళ్ళను కాచేవిధమును
చూశారా మీరు చూశారా

పిల్లల పందికి ప్రేమసంతుపై
చూశారా మీరు చూశారా

ప్రతి జీవిది నడవడి  గమనిస్తే
పరమాత్మడు జేసెడి  గమత్తే
కాదా అదిమరి

            

కామెంట్‌లు