మంచి నాన్న -బాల గేయం :--ఎం. వి. ఉమాదేవి నెల్లూరు
మంచివాడులే మా నాన్న
కొంచెం సాయం చేస్తాడు 
చెల్లిని నన్ను సైకిల్ పైన 
పాఠశాలకు చేరుస్తాడు !

సమయంలోగా పుస్తకాలు 
కాలం తోటి చెప్పులు గొడుగు 
సమదుస్తులు అమరుస్తూ 
చదువుకోమని చెప్తాడు !

పచ్చడిమెతుకులు తింటూనే   
పంటచేలోనే ఉంటాడు
హెచ్చుగా ధాన్యం పండించి 
దేశం మెచ్చే రైతవుతాడు !


కామెంట్‌లు