పల్లె గాని పల్లె వారు -( బాల గేయం )-ఎడ్ల లక్ష్మి-సిద్దిపేట
పల్లె గాని పల్లె వారు 
ఊరు గాని ఊరు వారు
బ్రతుకు దెరువు కొరుకు 
వచ్చి యున్న కూలి వారు

కరోనా బాధ తోటి వారు
చేయ పని లేక నేడు
కాళి నడకతోటి వారు
కదిలి రంతను జూడు

ముల్లెను పిల్లను యెత్తుకుని
వెనుక ముందు చూసుకుని
వారు వీరు తెచ్చి యిచ్చిన
పండ్లు ఫలములు తీసుకుని

ఆకలిని తీర్చుకుని వారు
చెట్టు క్రింద చేరినారు
సేదతీరి నిద్ర పోయివారు
అలుపు సొలుపు మరిచి నారు

నిద్ర లేచి చూసి నారు
తోవబట్టి నడచినారు
పిల్ల పాపల తోటి వారు
గమ్యమేమొ చేరినారు