కుందేలు తెలివి ( చిట్టి కథ)--ఎం. వి. ఉమాదేవి

 కుందేలుకి చాలా దిగులుగా ఉంది.అదికష్టపడి తెచ్చుకున్న 
చిలకడ దుంపలు,దొండపండ్లు 
సీతాఫలం నక్క రోజూ వచ్చి 
తినేసిపోతున్నది. అడిగితే జులుం మళ్ళీ.ఇలా కాదని ఒక
ఉపాయం పన్నింది.అడవిలోప ల ఒకఎలుగుబంటీ ఈనిఉంది
అని కుందేలు మిత్రుడు కాకి చెప్పిన మాట గుర్తు వచ్చిo ది. 
ఎలుగు ఉన్న పొదలపైన పొలాల్లో ఉన్న మొక్కజొన్న కండెలూ, కారెట్ లూ అక్కడక్కడ పెట్టి వచ్చింది. 
ఎలుగు నీరు తాగేదానికి సెలయేరుకి పోయినపుడు !
నక్క వినేలాగ కాకితో "ఇక తిండికి కరువు లేదు కాకిబావా
పనస చెట్టు దగ్గర పొదలకి 
క్యారెట్ లు, జొన్న కండెలూ 
కాసాయి. అవే తింటున్న రోజూ 
తెలుసా "అనే సరికి దొంగతిండికి అలవాటు పడిన 
నక్క పొదలకి క్యారెట్ లు ఎలా 
కాస్తాయి అని కూడా అనుకోకుండా రయ్యిమని పనస చెట్టుదగ్గరికి పోయి 
పొదలుకదిలించేశాక లోపల ఉన్న ఎలుగుబంటి భీకరంగా అరుస్తూ నక్కని పట్టుకొని వొళ్ళు అంతా రక్కి కొరికేసరికి 
ప్రాణభయంతో నక్క  వేరే అడవికి పారిపోయింది ! కాకి 
కుందేలు పండుగ చేసుకున్నాయ్ !

కామెంట్‌లు