విసన కర్ర (బాలగేయం )-- ఎం. వి. ఉమాదేవి - నెల్లూరు
ఎండాకాలం వచ్చిందోయ్ 
విసన కర్రలు తెచ్చిందోయ్ 
చల్లని గాలికి చేతులకూ 
చక్కని పనిగా కుదిరిందోయ్ !

కరెంటు బిల్లుల పనిలేదు 
కాలక్షేపం కొరతలేదు 
విసన కర్రలమ్మే వాళ్ళకి 
మిగిలిపోయే బాధేలేదు !

బస్టాండ్ ల్లో కదలనిబస్సు 
ఎండవేడికి యిష్షు బుస్సు 
విసినికర్రల అబ్బాయొస్తే 
బయటకు వచ్చేనిక పర్సు !

మేదరి వారి హస్తకళలు ఇవి 
సాదరంగా ఆదరించుమివి 
నీళ్ళు చల్లిన ఈతాకులతో 
మెత్తని వెదురు అల్లికలే ఇవి!