'తెలంగాణ వేమయ్య..!'---సుజాత.పి.వి.ఎల్.
కలం కత్తితో
కవితలు ఝలిపించి
జనం చైతన్యానికి అంకురం  తెలంగాణ మాణిక్యం..
విలువలు మరిచిపోయి
విహరించుటెన్నాళ్లు..
కల్తీ రహిత జగము కనిపించుటెన్నడో..
దైవమయిన నేడు ధనంకు దాసుడే..అంటూ..
మనుషుల్లో మృగ్యమయిపోతున్న 
మానవత్వభావనలను
కాగితాలపై పేర్చిన నిఖార్సయిన కవితేజం..
సమైక్య రాష్ట్రంలో..
తెలంగాణకు
జరిగిన అన్యాయాన్ని
వలస వాదుల దాష్టీకాన్ని దునుమాడిన నిర్భయ కవిరత్నం..
రావికంటి రామయ్య..
తెలుగు నుడికారసొబగుల..
తెలంగాణ వేమయ్య!!
****
 నేడు..మార్చి'30,.తెలంగాణ రచయిత..శ్రీ రావికంటి రామయ్య గుప్త వర్థంతిని పురస్కరిచుకుని..
ఈ రచన నా సొంతం,.అనుసరణ, అనుకరణ కాదు.
--సుజాత.పి.వి.ఎల్.