అదే ముఖ్యం:-- యామిజాల జగదీశ్
 జన్మించినప్పుడు శిశువు
మరణించినప్పుడు శవం
జననమరణాలు రెండూ
మన మాట కోసం చూడవవి
అటువంటప్పుడు
ఈమధ్యలో బతికేటప్పుడు
మతమూ
కులమూ
జాతీ వంటివి మోయాలనేమీ
నిర్బంధం లేదు
కాదూ కూడదని
ఒకవేళ మోయవలసివచ్చినా
ఇతర మతస్తులనూ
ఇతర కులస్తులనూ
ఇతర జాతులవారినీ
చిన్నచూపు చూడక
సాటి మనుషులే అన్న
సమభావంతో
చూడటం
కలసిమెలసి మెలగడం
ముఖ్యం
అదే మన జీవితానికి 
కావలసినది