మునక్కాయ సాంబార్:-రాణీ ప్రసాద్
ముద్ద పప్పునే ముద్దుగా వండి
మెత్తగా పప్పు గుత్తి తో రుద్ది
చింతపండు రసం కలిపి

మునక్కాయ ముక్కలే వేసి
మగ్గేదాకా ఉడక బెట్టి
తాలింపు వేస్తే సాంబారు

మహా రుచితో నోరే ఊరు
ముద్ద ముద్ద కూ లొట్టలు వేయు
మునక్కాయ, మజాకా నా

మునక్కాయ లేని సాంబారు
మహారాజు ఇంటి విందైనా
ఉప్పు లేని కూర లాంటిదే.

మహిళల చేతిలో మునక్కాయ
మహిలో సాంబార్ వినుతి కెక్కు
మునక్కాయ మహిమ కనరండి.