జామంటే ...జామ ..కాదు !!:- ------డా.కె.ఎల్.వి.ప్రసాద్- హన్మ కొండ .

ఋతువులు 
మారుతుంటాయ్ ,
ఋతువులతోపాటు 
జీవన సన్నివేశాలు 
మారుతుంటాయ్ !

కాలాన్ని బట్టి 
పువ్వులు -పళ్లు 
వాటికవే .....
ప్రత్యేకతలు ...!

ఎప్పుడూ కాసేవీ 
ఎల్లపుడూ పూసేవీ 
వుండొచ్చుగాక ...!

మనిషి--
 అవసరాలనుబట్టి ,
నిత్యం -
అందుబాటులోఉండే ,
ఫల -పుష్పాల 
సృష్టి జరుగుగాక !

ప్రకృతి మాత్రం 
ఆయారుతువులలో 
ఆయా ఫలాలను 
పుష్పాలనూ 
అందిస్తుంది ...!

వేసవిలో అలా 
లభించే ....
జామకాయకాని 
జామకాయ ....
మీకు తెలుసా .....!

అదేనండి ----
గులాబీ జామకాయ ,
చల్లదనానికి ....ఇది 
గుండెకాయ ......!!