*జాతీయ వైద్య దినోత్సవపు శుభాకాంక్షలతో...*--గజల్:-: -సోంపాక సీత- భద్రాచలం
*ప్రాణదీప నేస్తమా చేస్తున్నా వందనాలు !*
*వైద్యుడా ముదముతో చెబుతున్నా వందనాలు!!*

*కనిపించని వైరస్సుతో కలబడినా అడుగునీది!*
*"శతమానం భవతి"అని రాస్తున్నా వందనాలు!!*

*పనిభార మెంతైననూ ,అలసటనూ దిగమింగే!*
*ఇలవెలసిన ఇందీవర ఇస్తున్నా వందనాలు!!*

*నారాయణ తత్వానికి ప్రతిరూపపు సేనానివి!*
*దీనజనుల గోపురమా పడుతున్నా వందనాలు!!*
*వ్యక్తి కాదు,వృత్తికాదు; మహాశక్తి 'సిరిసీతా'!*
*కైమోడ్పులు అంజలిలా పడుతున్నా వందనాలు!!*