మైత్రి :-పటేండ్ల ఉండ్రాళ్ళ రాజేశం

 పిల్లి కుక్కెలుకలు చల్లటి నీడన
నిద్రబోవు తీరు నిండుదనము
వైరి జీవులనుచు వాగుట మనవంతు
కలిసినట్టిమైత్రి కనులవిందు