పిచుకమ్మ:- సత్యవాణి

 పొట్టి పిచుక పొట్టిపిచుక
గట్టిదానవె
పిడికెడన్ని వడ్లునీకు
పట్టుకొస్తునే
చిట్టి చిట్టి ముక్కుతోన
పట్టి వడ్లను
తుర్రుమనుచు గూటిలోకి
ఎగురవచ్చునే
గూటిలోని పిల్లలకు నోటినందున
పెట్టిరావె పొట్టిపిచుక
ప్రేమమీరగా
మరల మరల వేస్తునేను,
వడ్లగింజలు
మరల మరల తుర్రుమనుచు
ఎగిరి పోగదెే
చూసినేను సంబరాన
గంతులేసెదా
ఫోటోతీసి గ్రూపులోన
పోష్ట్ పెట్టెద