ఏనుగుమాట-:--పండుగాయల సుమలత.

 ఒకఅడవిలో పెద్ద ఎలుగుబంటి ఉండేది.
దానికి ఓ రోజు అడవిలో ఆహారం దొరకక ఆ రోజు రాత్రి ఆకలి బాధతో అడవి పక్కనే ఉన్న ఊరిలోకి వెళ్ళింది.అక్కడ ఎలుగుకు పెద్ద గొర్రెల మంద కనపడింది.ఆ గొర్రెలను చూస్తూనే చాలా సంతోషపడింది. ఒకగొర్రెను తిన్నది.
అలా రోజూ రాత్రివెళ్ళి గొర్రెను తినేది. ఆ ఎలుగుబంటి రోజూ అడవి నుండి రాత్రి వేళ వెళ్ళటం గమనించిన ఒక ఏనుగు దానిని పిలిచి" "నువ్వు దొంగతనంగా పల్లెకెళ్లి గొర్రెలను తింటున్నట్లున్నావు.దొంగ తనం మంచిది కాదు.అడవిలో వేటాడి సంపాదించుకునే తిండి తో తృప్తి పడు. నువ్వు దొరికితే ప్రమాదం"అని మంచి మాటలు చెప్పింది.
ఆ మాటలు ఎలుగుబంటి పెడచెవిన పెట్టింది.తన పద్దతి మానుకోలేదు.ఊరిలో రోజూ గొర్రెలు చంపబడుతున్నాయని గమనించిన ప్రజలు ఒక రోజు దుడ్డుకర్ర లతో ఊరి పొలిమేరల్లో చెట్లచాటున దాక్కుని కాపలా ఉన్నారు.అడవి నుండి ఎలుగుబంటి పల్లెలోకిరావటం గమనించి వెనుకల వచ్చి కర్రలతో బాగా కొట్టారు.దొంగతనం  ప్రమాదమని ఏనుగు చెప్పినా వినిపించుకోనందుకు తగిన శిక్ష పడింది.గాయాలతో మూల్గుతూ అడవి వైపు పరుగు తీసింది ఎలుగుబంటి..
పండుగాయలసుమలత.గొట్లూరు.కర్నూలుజిల్లా