దాగుడుమూతలు(బాల గేయం):--ఎడ్ల లక్ష్మి-సిద్దిపేట
ఆగు ఆగు జోగమ్మ
దాగుడుమూతలాడమ్మ
వీధి వారు వచ్చారు
గోదుమ లేమో తెచ్చారు

దోసిలి పట్టు జోగమ్మ
పోసిందెవరో చెప్పమ్మ
మూసిన కళ్ళు తెరువమ్మ
వారెవరో నీవు పట్టమ్మ

ఊరు వాళ్ళు వచ్చారు
వులువలు కొన్ని తెచ్చారు
ఓడి నిండా నింపారు
నింపిదెవరో చెప్పమ్మ

నలుగురు పిల్లలు వచ్చారు
పాలు పండ్లు తెచ్చారు
నీ పక్కకు వారు పెట్టారు
పెట్టింది ఎవరో చెప్పమ్మ