మానవా : -కిలపర్తి దాలినాయుడు

 రాతికే కరుణున్నదోయి
మాకు పుట్టుక నిచ్చెను
రాతియుగమే ఇంతకంటే
సుఖమునే మాకిచ్చెను
ఓయి మనిషీ! మొక్కను
మొక్కనూ మీ అక్కను!
ఆడపిల్లల ఉసురుదీసే
రాక్షసుడువని తెలియదే!
గుండెపై య్యాడించినా
గుండెలను తొలగింతువా?
ఊయలై నిను ఊపినా మా
ఉసురునే తీసేతువా?
ఒక్క అంగుళమాత్ర మైనా
విడువకా పూడ్చెతువా?
రాయికైనా కరుణగలదోయ్
సాయమెంచుము మానవా!
మా ఛాయ పెంచుము మానవా!