కరోనా(చీకటి వెలుగుల ప్రజాజీవనం)(నానీలు)డా‌.రామక కృష్ణమూర్తి-బోయినపల్లి,సికింద్రాబాద్.
1.ఒకరినొకరు
   కలవలేక
  యోగక్షేమాలు
  చూడ అనంతం.

2.పనులు లేక
   పస్తులు పండలేక
   బుక్కెడు బువ్వ కోసం
   ఆగమాగం.

3.చితి పేర్చినా
   వెళ్ళలేము
   కట్టె కాలినా
   పలకరించలేని ప్రమాదం.

4.ముట్టుకుంటే
   అంటుకుంటుందని
   పట్టుకుంటే
   ప్రాణం పోతుందని.

5.జీతాలు సగం
   జీవితాలు దుర్భరం
  బాధలు సంపూర్ణం
  ప్రజలు పాపం!

6.అన్నీ మూత
  ఆస్పత్రులు కాక
  దోపిడి వాత
  జేబులకు కోత.

7.వైరస్ తో
   అతలాకుతలం
   ప్రజాజీవనం
   ప్రత్యక్షనరకం.