కుండ (బాల గేయం)-ఎడ్ల లక్ష్మి-సిద్దిపేట
చెరువు కెళ్ళి చంద్రయ్య
చెరువుల మట్టి తెచ్చాడు
కుండి కట్టి తాడి పాడు
కాళ్ల తోటి తొక్కాడు

గూడు వేసి పెట్టాడు
మెత్తగ నానబెట్టాడు
ముద్దలు చేసి పెట్టాడు
చేతిలో ముద్ద పట్టాడు

సారే మీద పెట్టాడు
గిర గిర దాన్ని తిప్పాడు
కడవ చేసి చూపాడు
ఆములో పెట్టి కాల్చాడు

కుండ ఒకటి కొన్నాము
నిండా నీళ్ళు పోసాము
కుండలో నీళ్ళు చల్లగా
దప్పిక తీరా తాగాము