పగటి భానుడు(బాల గేయం)-ఎడ్ల లక్ష్మి -సిద్దిపేట
వచ్చాడమ్మా వచ్చాడు
సుప్రభాత సూర్యుడు
లేచాడమ్మా లేచాడు
రైతు నిద్రలేచాడు

నిన్నటి అలసట మరిచాడు
భుజాన నాగలి పెట్టాడు
పొలం పనికి వెళ్ళాడు
చల్లటి పూట దున్నాడు

బారెడు పొద్దు ఎక్కంగా
చురచుర ఎండ మండంగా
బిర బిర నాగలి విడిచాడు
గబ గబ ఇంటికి వచ్చాడు

నడుము వాల్చి ఒరిగాడు
నిద్ర లోకి జారాడు
సేద తీర్చుకున్నాడు
అలసట నంతా మరిచాడు