కానివి:-:- డా.గౌరవరాజు సతీష్ కుమార్.

 చిలుక గాని చిలుక 
ఏం చిలుక ? ఏం చిలుక ?
పంచదార చిలుక !
కోడి గాని కోడి
ఏం కోడి ? ఏం కోడి ?
పకోడి !
కర్ర గాని కర్ర
ఏం కర్ర ? ఏం కర్ర ?
జీలకర్ర !
కారం గాని కారం
ఏం కారం ? ఏం కారం ?
గుణకారం !
కారు గాని కారు
ఏం కారు ? ఏం కారు ?
పటకారు !
కాయ గాని కాయ
ఏం కాయ ? ఏం కాయ ?
నీ..... తలకాయ....!!

కామెంట్‌లు