ఫింగర్ ఆన్ లిప్స్--డా:కందేపి రాణిప్రసాద్


 ఆర్ణ కొత్తగా స్కూళ్ళో చేరింది కొత్తగా అంటే కొత్తగా ఏం కాదు అంతకు ముందు ప్లే స్కూలుకు వెళ్ళింది.ఇప్పుడు మాములు స్కూలుకు వెళుతున్నది.స్కూల్లో చాలా మంది కొత్త ఫ్రెండ్స్  ఉన్నారు. అంతతమందిని ఒక్కసారిగా చూసేసరికి ఆర్ణ చాలా సంతోషంగా ఉన్నది.ఇంట్లో ఆర్ణ ఒక్కతే చెల్లెళ్లు కానీ తమ్ముళ్లు కానీ  లేరు ఒకసారి మమ్మిని 

అడిగింది "మనింట్లో చెల్లె కానీ తమ్ముడు కానీ ఎందుకు లేరు మమ్మి అందరింట్లో ఉన్నట్లు" అని చూడు ఆర్ణ ' నేను,డాడీ ఆఫీసులకు వెళ్ళిపోతే చెల్లినో,తముడినో ఎవరు చూసుకుంటారు.అందుకే వద్దు తల్లీ" అన్నది మమ్మి దీప్తి" మరి తననెవారు చూసుకున్నారు" అనుకుంది ఆర్ణ కానీ అడగలేదు.

కొత్త స్కూల్లో చాలా మంది పిల్లలున్నారు. అడుకోవాలని సంబరపడింది ఆర్ణ కానీ ఇక్కడ ఎప్పుడు పాఠాలు చెప్పడమే తప్ప అడుకొనివ్వడం లేదు.పిరియడ్ కు పీరియడ్ కు మద్యయిన కనీసం మాట్లాడుకుందాంటే ఫింగర్ ఆన్ లిప్స్ అంటున్నారు.పాత స్కూల్లో బాగా ఆడించేవారు.ఈ స్కూలులో పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు.

 కనియాడుకొనివ్వడం లేదు మాట్లాడుకొనివ్వడం లేదు.వరుసగా పీరియడ్స్ ఖాళీ ఉండదు.లంచ్ టైములో అన్నం తినటమే సరిపోతున్నది డ్రిల్ పీరియడ్ అంటూ లేనేలేదు.ఎప్పుడైనా క్యారం బోర్డ్ ఇస్తారు అడుకోమని.ఎప్పుడు ఫింగర్ ఆన్ లిప్స్ అనటం తప్ప మాట్లాడనే మాట్లాడనివ్వరు.స్కూల్లో ఉన్నంత సేపూ మాట్లాడే ఛాన్స్ లేదు.

స్కూలు వదిలేయగానే ఇంటికి ఆనందంగా వస్తుంది. ఆర్ణ స్కూల్లో జరిగిన విషయాలన్నీ చెప్పాలని ఉబలాట పడుతుంది.కానీ ఇంటికి వచ్చేసరికి మమ్మి డాడీ ఇంట్లో ఉండరు. అప్పటికిప్ర ఆఫీసు నుంచి రారు ఎప్పుడో పొద్దు పోయి వస్తారు.

ఆ టైముకు ఆర్ణకు నిద్రస్తుంది.

ప్రతిరోజు ఆర్ణ కలలు కంటూనే ఉన్నది. స్కూల్లో 

ప్రెండ్సందరితో గల గల మాట్లాడుకోవలని ఎగిరి గంతులేయలని అన్నిటికి డిసిప్లిన్ అంటారు.పోనీ ఇంటికి వచ్చాక అన్ని కబుర్లు అమ్మకు చెబుతూ ఉంటే, అమ్మ అన్నం నోట్లో పెడుతూ ఉంటే ఎంత కమ్మటి కల అనుకుంటుంది.ఈ కల ఎప్పటికి నెరవేరదు.మాటలు రాని మూగదానిలా ఉండటమే బాగా చదువుకోవటమా! ఆనందంగా ఉండనసరం లేదా!స్కూళ్ళోనేమో "ఫింగర్ ఆన్ లిప్స్"అని మాట్లాడనివ్వరు.పోనీ ఇంట్లో మాట్లాడుకుందామంటే అమ్మా నాన్న ఆఫీసులో ఉంటారు.నానమ్మ ,తాతయ్య ఓల్డేజ్ హోమ్ లో ఉంటారు. ఏం చేయాలి నేను! బాధగా అనుకుంది ఆర్ణ.o