వీధి జీవితాలు (బాల గేయం):--ఎడ్ల లక్ష్మి-సిద్దిపేట
విశాలమైన ఈ లోకంలో వింతలు
వీధి ఆవరణ లోనే వీరి వంటలు
తూము పైపుల్లోనే నివాసాలు
ఏమిటి వీరి బ్రతుకు పోరాటాలు

ఊరువాడ లేనివారు వీరు
కూలి పనిలో జోరుగా వీరు
అడుగు ముందుకు వేస్తారు
ఆడుతూ పాడుతూ చేస్తారు

సాయంకాల సమయములో
వారి నివాసానికి చేరుతారు
వీధి దీపాల వెలుగులో
కాలం గడుపుతుంటారు

కారం మెతుకులు తింటారు
కటిక నేలమీద నిద్రిస్తారు
చుక్క పొద్దుకు నిద్రలేస్తారు
చక చక పరుగులు తీస్తారు



కామెంట్‌లు