ఆవు పులి: కందేపి రాణి ప్రసాద్

 ఊర్లో అందరూ అడవి వైపు పరుగులు తీస్తున్నారు.అడవి మొదట్లో పులి చచ్చిపడి ఉంది అన్న వార్త తెలిసి అందరూ చూడటానికి బయలు దేరారు.అడవిని చేరుకున్నారు.నిజంగానే పులి చచ్చిపోయింది.ఎదో అనారోగ్యముతో చనిపోయినట్లుగా ఉన్నది.అందరూ పులిని ఆశ్చర్యంగా చూస్తున్నారు గాని చచ్చిన పులి చుట్టూ తిరుగుతున్న పులి కునాను ఎవరు పట్టించుకోవడంలేదు.
 
రంగయ్య మాత్రం ఆపసికూనను తనతో పాటు తీసుకువచ్చాడు. రంగయ్య దగ్గర ఆవులు ఉన్నాయి
చిన్ని పులి కూనను ఆవు దగ్గర వదిలి పెట్టాడు.ఆవు దగ్గరకు తీసుకున్నది.తన పాలు ఇచ్చింది.తన శత్రువైన అయినప్పటికి తల్లిని కోల్పోయిన బాధలో ఉన్న పులి కూనకు ఆకలి తీర్చింది.
పులి రోజు అవుదగ్గరే పాలు తగుతున్నది. ఆవును తల్లి లనే భావిస్తున్నది.ఆవు కూడా బిడ్డ వలే ప్రేమిస్తున్నది.కొంత కాలానికి పులికూన కొంచెం పెద్దదయింది.పాలు తాగే వయసు దాటింది.రంగయ్య పులికూనను అడవిలో వదిలే సమయం వచ్చిందని భావించాడు.దానికి తల్లి అవసరం తిరిపోయింది.ఒకనాడు పులికునను అడవిలో వదిలి పెట్టి వచ్చాడు రంగయ్యకొంత కాలానికి రంగయ్య తన ఆర్థిక పరిస్థితి బాగలేనందున తన ఆవును పక్కూరి రైతుకు అమ్మేశాడు.ఆవు పాలిచ్చిన్నాళ్లు రైతు ఆవుకు గడ్డి పెట్టాడు.ఆతర్వాత ఆవు ముసలిదైపోయిందని కటికోళ్లకు అమ్మేశాడు రైతు ఈ అవును అక్కడకు చేర్చారు. 
కటికోళ్ళు ఆవుల్ని కోసే పాక ఊరి వెలుపల ఉన్నది.
రెండు రోజుల్లో  ఈ ఆవును నరికి ముక్కలు చేసి మాంసం అమ్ముకోవలని అనుకున్నారు. దినంగా ఆ పాకలో పడి ఉన్నది ఆవు. 
ఆ రాత్రి వేళ అడవి నుంచి ఒక పులి ఈ పాకకు వచ్చింది.ఏదైన ఆహారందోరుకుతుందేమోనని అక్కడ ఆవు నీరసంగా పడుకొని ఉంది. పులివచ్చి ఈ ఆవును చూసి గుర్తు పట్టింది. తన చిన్ననాడు తనకు పాలిచ్చిన ఆవు ఇదే. పులి ఎంతో  ప్రేమగా అవును పలకరించింది.ఆవు ఎంతో సంతోషపడింది.
పులి ఆవు కట్లు విప్పింది.తనతో పాటు ఆవును అడవికి తీసికెళ్లింది.ఆవును తల్లిలా ప్రేమగా చేసుకున్నది.రోజు ఆవు కోసం గడ్డి తెచ్చేది.ఆవు బతికున్నంత కాలం పులి చక్కగా ఆకలి దిర్చింది.రక్షణగా ఉన్నది.తనను చిన్నతనంలో అదుకున్నందుకు కృతజ్ఞతతో ఆవును తల్లిలా పోషించింది. క్రూర జంతువైనా ధర్మాన్ని వీడలేదు.