'సహాయం'... - ఎన్నవెళ్లి రాజమౌళి - కథల తాతయ్య

 ఆగయ్య వచ్చి ఏమో పిలిచారట అయ్యగారు అని అనగానే-మా భూమి పాలు కు చేస్తావా! అని అనగానే -చేస్తా కానీ, నాకు పోతులు దున్నటానికి లేవు కదా! అన్నాడు. పోతుల కు ఎంత అవుతుంది అని నేను అనగానే-ఐదు వేలు అవుతుంది అన్నాడు ఆగయ్య. సరే! అయితే అయితే డబ్బు నేను సిద్దిపేటలో తెస్తా పంట మీద పాలు నుండి తేరుపుకోవాలిమరీ! సరే అయ్యగారు అని ఆగయ్య వెళ్లాడు. అన్నట్టే డబ్బు తెచ్చి ఇంట్లో పెట్టుకున్న. తెల్లారి వచ్చి డబ్బు తీసుకెళ్లి పోతులు ఖరీదు చేసి తెచ్చుకున్నాడు. దున్న కాలు అయినాక, పోతుల బావి కాడ కట్టేసి వచ్చాడు. రాత్రి ఎవరో దొంగలు పోతుల కాజేశారు. ఈ విషయం ఆగయ్య వచ్చి నాకు చెప్పాడు. ఆగయ్య కు నలుగురు బిడ్డలు. ఆర్థికంగా బాగా వెనుకబడి ఉన్నాడు. రాత్రి అంతా ఆలోచన చేసి-మా తమ్ముడితో-విధు మౌళి! వడ్లు రాగానే ముందుగా పోతుల ల డబ్బుకు సరిపడా వడ్లు తీసి, ఆగయ్య కు సహాయం చేసి-తర్వాతనే మనం పంచుకుందాం అన్న-మా తమ్ముడు -మొదలు మనం ఎందుకు ఇవ్వాలి అను డే కాక, మనం బాకీ తెచ్చాం అదేదో-ఆగయ్య నే చెల్లించు కోవాలి అన్నాడు. ఒకసారి పంట నష్టం వస్తుందేమో కానీ, మనభూమి అయితే పోత లేదు కదాఅని-నేను ఆగయ్య పరిస్థితి చెబితే సరేనన్నారు. ఆగయ్య ని పిలిచి ఈ విషయం చెప్పి మళ్లీ 5,000 పోతుల కు ఇచ్చాను. ఇప్పుడు మాత్రం పోతులు జాగ్రత్త అని చెప్పాను. ఇప్పటికి ఆగయ్య కన పడినప్పుడల్లా రెండు చేతుల దండం పెడుతూ ఉంటాడు.