నా చదువు - నా కథ:- అక్షర కూరపాటి

 నా జన్మస్థానం యశోద హాస్పిటల్  సికింద్రాబాద్, హైదరాబాద్. అమ్మ కి నార్మల్ డెలివరీ కాలేదు. సిజేరియన్ చేశారు. యెందుకంటే అమ్మ కి బీపీ పెరిగింది , ఒకవేళ పెరిగుండకపోతే నార్మల్ డెలివరీ అయ్యేది.
నేను నర్సరీ చదవలేదు ఎందుకంటే  నాకు నర్సరీ లో చదవలసిన చదువు నర్సరీకంటే ముందే వచ్చు . అలా నేను ఎల్.కే.జి కి జంప్ అయ్యా. మళ్ళీ యీ క్లాస్ లోకి రాకముందే 2 ఇయర్స్ లోపే నాకు డైజెస్టీవ్ సిస్టమ్ మొత్తం వచ్చు. అమ్మ నాకు గోరుముద్దలు పెడుతూ “ఇదిగో మనం అన్నం తినేటప్పుడు మన నోట్లో నుంచి అలా..
ఈసోఫెగస్ లో నుంచి పొట్ట లోపలికి వెళ్ళుతుంది. వెళ్ళి  ఆ తరువాత చిన్న ఇంటెస్టైన్ లో నుంచి పెద్ద ఇంటెస్టైన్ లోకి వెళ్ళి రెక్టమ్ లో నుంచి ఆనస్ నుంచి బయటకి వస్తుంది” అని చెప్పేది.
మళ్ళీ నేను 1 st  క్లాస్ దాకా గుడ్ గర్ల్ లాగా ఉన్న. కానీ 2 nd క్లాస్ లో అమ్మ కి మొదలయింది రామాయణం అన్నట్టుగా అయిపోయింది . యెందుకంటే అప్పటినుంచి నా కొంటె పనులు స్టార్ట్ అయ్యాయి. ఫస్ట్ నేను టి.వి కి ఓడామస్ పూసి 3 బక్కెట్ల నీళ్ళు  పోసి కడిగిన. ఇంకా యెముంది  ఫ్లోర్ మొత్తం నీళ్ళు అయ్యిపోయింది. అమ్మ ఇంటికి అడుగు పెట్టిందో లేదో నా పని ఫట్ అయ్యింది. నన్ను చీపురు కట్ట తో కొట్టింది. అమ్మకు అంతా కోపమొచ్చింది మరి.
6 th క్లాస్ లో అమ్మ 10 టి‌వికి షిఫ్ట్ అయ్యింది ఇంకేముంది నా చదువును చూసే వాళ్ళే లేరు. ఇంకా నాకు చదువు మీద ఇంట్రెస్ట్ కొంచమే మిగిలింది. ఈ కరోనా వచ్చి లాక్డౌన్  మొదలు అని అనేశారు. ఇంకా స్కూల్స్ బంద్. ఉన్న కొంచం ఇంట్రెస్ట్  కూడా పోయిది నాకు చదువులో.అలా......
నా 7 th క్లాస్ లో online క్లాస్ స్టార్ట్ అని అన్నారు.అప్పుడు అయింది నా పని. అప్పుడు నేను ఒక నెల రెండు నెలలు ఏదో బందెలకు విన్నట్టుగా విన్న. కొన్నిరోజులకి నా చదువు మొత్తం పాడయింది. ఎందుకంటే నేను చెవి లో headphones పెట్టుకొని ఫోన్ లో గేమ్స్ ఆడుతుండేదానిని. అది కూడా అమ్మ కి తెలియకుండా. క్లాస్ వినకుండా.అమ్మ అన్నాక ఇంకా ఎన్నిరోజులు మోసపోతుంది.? ఇంకేముంది ఒక రోజు అమ్మ కి నేను ఇలా చేస్తున్నానని డౌట్ వచ్చేసింది.
ఇంకా అమ్మ నాతో మాట్లాడ కుండ 3 రోజులు ఉంది .......వామ్మో....చాలా భయమేసి అంతా చెప్పేసా.. నిజం చెప్పానని అమ్మకు కోపం పోయింది. అమ్మ మాట్లాడి మళ్ళీ చదువు అని అనింది. సరే అన్ననే తప్ప చదవలేదు. అమ్మ చాలా బాధ పడింది. యెడిచింది. తరువాత మెల్లగా  నేను చదువుతానని  అమ్మకి మాట ఇచ్చాను.