పూర్వం ఓ యువతి మనసులో అనేక కథలూ పాటలూ ఉండేవి. కానీ ఆమె ఎవరికీ ఒక్క కథ కూడా చెప్పలేదు. ఒక్క పాటా పాడిందీ లేదు. దాంతో ఆమె మనసులో ఉన్న కథలూ పాటలూ మరొకరికి ఎప్పుడు చేరుతామో అని బాధపడుతుండేవి.
ఓరోజు ఆమె నిద్రపోతున్నప్పుడు ఓ కథ ఓ పాట ఆమె నోటిగుండా బయటకు వచ్చి వాకిట్లో చెప్పుగానూ గొడుగుగానూ మారాయి.
కాస్సేపటికి భర్త ఇంటికి వస్తాడు. వాకిట్లో ఉన్న చెప్పునీ గొడుగునూ చూసి ఎవరొచ్చారింటికి అని ఆమెను అడుగుతాడు.
ఎవరూ రాలేదని ఆమె చెప్పగా అతను ఆమెను అనుమానిస్తాడు. గొడవపడతాడు.
భార్యమీది కోపంతో అతను ఇంటలో నించి వెళ్ళి రాత్రి ఓ ఆలయ మండపంలో పడుకుంటాడు.
ఆరోజు రాత్రి ఊళ్ళో దీపాలన్నీ ఆర్పేసిన తర్వాత దీపాల కాంతులన్నీ ఈ ఆలయ మండపంలో గుమికూడి మాట్లాడుకోవడం అలవాటు. అయితే ఆరోజు ఓ దీపం వెలుగు మాత్రం ఈ సమావేశానికి ఆలస్యంగా వచ్చింది.
ఆలస్యానికి కారణమేమిటని మిగిలిన దీపపు వెలుగులన్నీ ప్రశ్నించగా అది ఇలా చెప్తుంది....
"ఇదిగో ఇక్కడ నిద్రపోతున్నతని భార్యకు బోలెడు కథలూ పాటలూ తెలుసు. కానీ ఆమె ఎవరితోనూ వాటిని పంచుకోకపోవడంతో ఓ కథ ఓ పాట ఆమెకు తెలియకుండానే ఆమె నోట్లోంచి బయటకు వచ్చి చెప్పుగానూ గొడుగుగానూ మారిపోయి వాకిట్లో ఉంటాయి. వాటిని చూసి ఇతను తన భార్యను అనుమానించి ఘర్షణపడి ఇక్కడికొచ్చి నిద్రపోతున్నాడు. పాపం ఆ యువతి" అని.
ఈ మాటలు విన్న ఆ భర్త తన భార్యను తప్పుగా అర్థం చేసుకున్నందుకు బాధపడి వెంటనే ఇంటికి వెళ్ళి క్షమాపణలు కోరుతాడు. అంతేకాదు, తనకొచ్చిన కథలనూ పాటలనూ నలుగురికీ చెప్పించి ఆనందపడతాడు.
ఆ తర్వాత ఆ దంపతులు ఆనందంగా జీవించారని కథ ముగుస్తుంది.
ఇదొక కన్నడ జానపద కథ.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి