తుదకు మట్టే(వచనకవిత)-డా.రామక కృష్ణమూర్తి-బోయినపల్లి,సికింద్రాబాద్.


 అంకురాలను తనలో చేర్చుకొని మొలకెత్తిస్తుంది.

వాననీటిని తనలో ఇముడ్చుకొని భూగర్భజలాలు

పెంచుతుంది.

పాదాల అడుగు భాగాలనంటుకొని

పవిత్రమొనరిస్తుంది.

ఎద్దులగిట్టలకు అంటి 

సస్యాన్ని పండిస్తుంది.

పాతాళగంగకు చోటిచ్చి

పక్కకు వైదొలుగుతుంది.

తనతో ఆడుకునే పిల్లలకు

శక్తిని పెంచుతుంది.

గాలువానల భీభత్సంతో పక్కకు తొలిగి కొత్తదనాన్ని ఆహ్వానిస్తుంది.

బురదగా మారి పంకజాలను విప్పారిస్తుంది.

చివరకు శ్మశానంలో తనలో చేర్చుకొని శాంతినిస్తుంది.