ఓ..మాట కోసం...!!:-__కె.ఎల్వీ .-హనంకొండ.
ఉదయం 
ఆత్రుత కొద్దీ 
పేస్బుక్ 
తెరుస్తామా ,
వీడియోల దాడి ,
బుర్ర పేలగొడుతుంది !

పోనీలే అని ...
వాట్స్ ఆప్ 
గేటు తెరుస్తామా ...
చూసినవే ...
మళ్ళీ ....మళ్లీ ,
రక రకాల 
గ్రూపుల్లోంచి 
తొంగి చూసి 
వికటాట్టహాసం 
చేస్తుంటాయి !

స్వంతంగా 
ఒక మాట రాసే 
దిక్కుండదు ,
మాయదారి గోల 
అన్నీ ...
ఫార్వార్డ్ మెసేజ్ లే !!