అల్లరి పిల్లోడు(బాల గేయం)--ఎడ్ల లక్ష్మి-సిద్దిపేట
పాల బుగ్గల చిన్నోడు
పరుగులు తీస్తూ వచ్చాడు
కాళు జారి పడ్డాడు
వ్రేలు విరిగిపోయింది

బొబ్బ పెట్టి ఏడ్చాడు
సుబ్బయ్య తాత వచ్చాడు
వాన్ని జబ్బకు వేసుకుని
వైద్యశాలకు వెళ్ళాడు

వైద్యుడు వచ్చి చూశాడు
చేతికి పట్టి వేశాడు
మందుబిళ్లలు ఇచ్చాడు
ముద్దుగా మాత్రలు మింగాడు

ఇంటికి తిరిగి వచ్చారు
బుక్కెడు బువ్వ తిన్నాడు
అల్లరి అల్లరి చేశాడు
హాయిగా నిద్రపోయాడు