రబ్బరు చెప్పులు ..!!:- -----శ్యామ్ కుమార్.చాగల్.-నిజామాబాద్.


 నేను చదివింది పేరుకి తాలూకా (బోనగిరి )అయినా అది,చిన్న పల్లెటూరు లాంటిది. అక్కడ గర్ల్స్ హై స్కూల్ లో ,మరియు బాయ్స్ హై స్కూల్లో చదివాను.  ఆరవ తరగతి వరకు గర్ల్స్ హై స్కూల్లో మాది- కోఎడ్యుకేషన్.

 మాకుఅప్పట్లో, హోం వర్క్ అన్నది తెలియదు. హోంవర్క్  కు,ఆ రోజుల్లో ఇలాంటి కాన్సెప్ట్ లేదు. మా దగ్గర ఒక బ్యాగ్ లో ఉదయం   క్లాసులకు సంబందిన్చిన, పుస్తకాలు  రెండవ దానిలో మధ్యాహ్నం కు,సంబంధించిన పుస్తకాలువున్డేవి. మధ్యాహ్నం భోజనం అయిన తర్వాత రెండోది తీసుకుని వెళ్ళేవాళ్ళం . స్కూల్ అయిపోయిన తర్వాత ఇన్టికి వచ్చి  ఇంక ఆటలే ఆటలు! సాయంకాలం ఇంట్లో మజ్జిగ ను  చాలా ఇష్టం గా తాగి, బయిటకు పరుగు. ఎవరినీ ఎవరూ పిలవక పోయినా అందరూ ఆ సమయానికి ఒకచోటికి,చేరే వాళ్లo.


   అప్పుడు    నేను 7th క్లాస్ చదువుతు న్నా ను అని గుర్తు.  నాకు మా బాబాయి కరోనా- రబ్బర్   చెప్పులు కొని ఇచ్చారు.  అవి వేసుకుని గాలిలో తేలిపో తూ వెళ్ళే వాడిని.  ఎప్పుడు చూసిన నా కాళ్ళ లో లోతుగా తుమ్మ ముళ్లు దిగే వి. వాటిని మా బాబాయి తీసే వారు. ఆయన అంటే వణుకు నాకు.  నొప్పితో గిలగిల కొట్టు కుంటూ కూడా, నోరు మూసుకుని కూర్చుని వుండవలసి వచ్చేది.  అందుకుగాను రబ్బర్ చెప్పులు కొన్నారు.  కానీ ఆటల సమయంలో వాటిని ఒక ప్రక్క వదిలేసి, ఆడే వాళ్ళం.  అయితే అసలు విషయం ఏమిటంటే ఆటలు అయిపోయిన తర్వాత వాటిని అక్కడే వుంచి ఎం చక్క, ఇంటికి వెళ్ళి పోయే వాళ్లం. రాత్రికి మా నానమ్మ అడిగితే అప్పుడు గుర్తు వచ్చే ది.  మళ్లీ వెంటనే ఆ ప్రదేశం వెళ్లి, ఆ చీకటిలో వెతుక్కొని అవి దొరక గానె తెగ సంతోషం పడుతు ఇంటికి వచ్చే వాడిని. ఆ చెప్పులు అలవాటు కావడంలేదని, ఎక్కడ పడితే అక్కడ మర్చి పోతున్నా అని ఆ తర్వాత ఒక ఆలోచన కలిగింది మా పెద్ద వాళ్ల కు.  అదేమిటి అంటే, సేన్డిల్స్!  . అప్పటి నుండీ కాలేజీ వరకూ సాండిల్స్ మాత్రమే వాడినాను. తర్వాత, డిగ్రీ కళాశాల లో షూ కొన్నా ను. ఇప్పటి వరకూ షూస్ మాత్రమే అలవాటు.

మొదటి రబ్బర్ చెప్పులు మాత్రం ఎప్పటికీ మర్చి పోను.అదొక మధురానుభూతి,గొప్ప జ్నాపకం.బాల్యం లో ఒక మైలు రాయి.