ఈనాటి నానీలు :--------డా .కె .ఎల్.వి.ప్రసాద్ ,హన్మకొండ .

 ఇంట్లో మగడు -
ఆఫీసులో బాసు ,
చూపులో తేడా -
దోపిడీలో దొంగలే !!
*****************
సహనం -ఓర్పు 
ప్రేమ -కలబోస్తే 
నిత్య శ్రమ శక్తి !
ఆమె స్త్రీ మూర్తి !!
***************
భర్త చూపుకు ,
పెద్దల సేవకు ,
పిల్లల సంరక్షణకు ,
ఆమె చిరునామా ..!
******************
నిన్నటి ఆమె వేరు ,
నేటి ఆమె ఇంకా వేరు ,
రేపటి ఆమె....
సంచలనమే ...!!
********************
**మహిళా మణులందరికీ 
అంతర్జాతీయ మహిళా దినోత్సవ 
శుభాకాంక్షలు.**